Others

చదువు సమాజం కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి 21వ శతాబ్దంలో అన్ని దేశాలూ ప్రాథమిక విద్యను బలోపేతం చేసుకుంటున్నాయి. సమాజం సాధించిన నైపుణ్యాన్ని, విలువలను, సున్నితమైన భావాలను భావి తరానికి అందజేయడమే ప్రధాన కర్తవ్యంగా ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్నాయి. ఈ అంశానే్న ప్రాథమిక విద్యలో చేర్చి ప్రగతికి బాటలు వేస్తున్నాయి. మన దేశంలోనూ ప్రాథమిక విద్యను మెరుగుపరిచినపుడే విద్యార్థుల్లో కాల్పనిక శక్తి వృద్ధి చెందుతుంది. సామాజిక అవగాహన, రాజ్యాంగంపై చైతన్యం, వివేకం అనేవి ప్రాథమిక లక్షణాలు. అక్షరజ్ఞానం కంటే విద్యార్థులకు సామాజిక జ్ఞానాన్ని అందించగలిగితే తరగతి గది వారి ప్రగతికి సోపానమవుతుంది. ఉన్నత చదువుల కన్నా ప్రాథమిక విద్యకు బలమైన పునాది ఉండాలి. తగిన పునాది ఉంటేనే విద్యార్థి ఎదుగుతాడు. తన చదువును సమాజం కోసం వినియోగిస్తాడు. స్వతహాగా ఎదిగే విద్యార్థులే దేశానికి పెద్ద పెట్టుబడి. కుటుంబం నుంచి, పరిసరాల నుంచి, సమాజం నుంచి విభిన్న అంశాలను నేర్చుకుని తరగతి గదిని తీర్చిదిద్దుకోవాలి. సామాజీకీకరణ పాఠశాలల్లో మొదలుకావాలి. చదువుల తీరు మారినపుడే తరగతి గది సమాజానికి, దేశానికి చేదోడుగా నిలుస్తుంది. ‘తరగతి గది దేశ ప్రగతిలో కీలకం కావాలి’ అన్నదే నేటి నినాదం. చదువు వ్యక్తి కోసం కాదు.. సమాజం కోసం అని విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పించాలి.
విద్య లక్ష్యం..
తరగతి గది ‘కాల్పనిక శక్తి’కి రూపకల్పన చేసే క్షేత్రం. కాల్పనిక ఆలోచనలను పెంచేదే తరగతి గది. కాల్పనిక శక్తి కేవలం మెదడుకే పరిమితం కాదు. అది శరీరంలోని అన్ని భాగాల్లో భాగస్వామ్యం వహించాలి. తరగతి గదిలో విద్యార్థి తన ముఖాన్ని తాను చూసుకుంటాడు. కేవలం మేధస్సు పాత్రే కాదు. విద్యార్థి అనునిత్యం తనను తాను శిల్పిలా చెక్కుకుంటాడు. విద్యార్థులందరినీ శిల్పులుగా తరగతి గది తీర్చిదిద్దుతుంది. ఫలితంగా విద్యార్థిలో పూజ్యభావం, సమాజంపై గౌరవం పెరుగుతుంది. జ్ఞానాన్ని పూజించాలన్న భావన ఏర్పడుతుంది. అదే శోధనకు కారణభూతమవుతుంది. ఆ శోధన కారణంగానే ప్రజాహితం కోసం పనిచేసేలా విద్యార్థుల్లో సేవాభావం అంకురిస్తుంది. అవయవాల మార్పిడితో కొందరికి ఇబ్బందులు తొలగిపోతాయి. కంటిలోని కార్నియాను మార్చితే కొందరిలో అంధత్వం పోతుంది. సేవాభావాన్ని, మానవత్వాన్ని మేల్కొలపడమే విద్య లక్ష్యం. విద్య లక్ష్యం ఉపాధి కాదు. దాని లక్ష్యం సమాజమే. సమాజానికి కొత్త సందేశాన్ని ఇవ్వడమే విద్య లక్ష్యం. ఇందుకు తరగతి గది వేదిక అవుతుంది.
ముందుచూపు..
తరగతి గదికి ముందుచూపు ఎంత ప్రధానమో కింది చూపు, పక్కచూపు కూడా అంతే అవసరం. సమాజపు సుస్థిరతను కాపాడడం తరగతి గది ప్రధాన లక్ష్యం. ప్రతి విద్యార్థి తనకన్నా తక్కువ జ్ఞాన సంపద, సామాజిక హోదా కలిగిన సహచర పిల్లలను ప్రేమించడం అలవరచుకోవాలి. ఇదే తరగతి లక్ష్యం. అదే లేకుంటే రామానుజం ప్రొఫెసర్ హార్దీని కలిసేవాడా?
తరగతి గది విద్యార్థులను ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందో అంతే సుస్థిరతను కూడా కలిగిస్తుంది. అది విద్యార్థులకు ఉన్నతమైన కొన్ని విలువలను సైతం నేర్పుతుంది. ఆ విలువలు సమాజంలో అంతర్లీనంగా ఉంటాయి. విలువల లక్ష్యం విద్యార్థి వ్యక్తిత్వం పెంచడమే కాదు, ఆ విద్యార్థిని తన సమాజంతో, తోటి మనుషులతో మమేకం చేస్తుంది. తరగతి గది విద్యార్థిని సంపూర్ణ వ్యక్తిత్వం గల వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. సంస్కృతిని ప్రేమించడం అంటే గతంలోకి పోవడం కాదు, తన సంస్కృతే విద్యార్థికి విలువలను నేర్పుతుంది. ఆ విలువలే విద్యార్థులకు వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తాయి. అందుకే తరగతి గది అన్ని వైపులా దృష్టి సారించాలి.

-చుక్కా రామయ్య