Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

3 నిమేషములు- 1 క్షణము (ఇందు 3న16,200= 48,600 పరమాణువుల కాలము గలదు)
5 క్షణములు - 1 కాష్ఠ (ఇందు 5న48,600 = 2,43,000 పరమాణువుల కాలము గలదు)
1 కాష్ఠ కాలములో - 3న5 = 15 నిమేషమలు గలవు
15 నిమేషములు - 1 కాష్ఠ
30 కాష్ఠలు - 1 కళ
30 కళలు - 1 ముహూర్తము
30 ముహూర్తములు - 1 దివారాత్రము = 24 గంటలు
24 గంటలు = నిమేషములు 15న30న30న30
= సెకండ్లు 24న60న60
1 నిమేషము
ఇంత సూక్ష్మమైన కొలతలను, ఇంత బృహత్తరమైన కొలతలను కూడా విస్తారంగా వినియోగించుకునే విజ్ఞాన శాఖలు ఆ కాలంలో సజీవంగా ఉండి ఉండకపోతే, ఇలాంటి కొలమానాలు రూపొందేవి కాదు. దురదృష్టవశాత్తు ఆ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు మనకు ఇపుడు దొరకటం లేదు. ఈ కొలమానాలను సూచకంగా తీసుకుని మనం మన పురాతన విజ్ఞాన శాఖల కోసం మరింత లోతుగా అనే్వషించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
భూ విజ్ఞానము
మనం ఇప్పటివరకు కొన్ని ఖగోళ అంశాలను పరిచయం చేసుకున్నాము. ఈ పరిశీలనలో భూమి మీద నిలబడిన మానవుడు, భూమిని కేంద్రంగా చేసుకుని చేసిన పరిశీలనలే. అందువల్లే మన పూర్వికులు భూమిని గ్రహంగా పరిగణించలేదు. గ్రహము అనే శబ్దానికి- భూమిమీద నిలబడిన మానవుడు యంత్రాల సహాయం లేకుండా, సూటిగా తన కంటితో గ్రహించబడగల ఖగోళీయ పదార్థము-అని వారు నిర్వచించినారు.
ఆధునిక ఖగోళ పరిశోధకుల కొన్ని ఖగోళీయ పదార్థాలను ఎంచుకుని, వాటికి ప్లానెట్స్ అని పేరుపెట్టారు. వాటిలో భూమి కూడ ఉంది.
ఆంగ్ల పదానికి సంస్కృతీకరించే ప్రయత్నంలో ఎవడో ఒక ప్రబుద్ధుడు ప్లానెట్ అనే పదానికి గ్రహము అని అనువాదం చేశాడు. దాన్ని పట్టుకుని కొందరు భూమి గ్రహము అవునా, కాదా అని చర్చలు చేస్తున్నారు. నిజానికి గ్రహము, ప్లానెట్ అనేవి వేరేవేరే పారిభాషిక పదాలు. వాటిని కలగాపులగం చేసుకుని చర్చలు పెంచుకోవటం కన్నా, మనం దేనిమీద నిలబడి ఖగోళ పరిశోధనలు చేస్తున్నామో, అలాంటి భూమిని గురించి మన వేద ఋషులకు ఉన్న అవగాహన ఏమిటో పరిశీలించటం ఎక్కువ ఉపయోగకరం. మనం ఇప్పుడు సంగ్రహంగా ఆ పని చేద్దాం.
భూమి బల్లపరుపుగా వుందని కొద్ది శతాబ్దాల కిందటిదాకా పాశ్చాత్య వైజ్ఞానికుల్లో చాలామంది భావించారు. ఇక చంద్రుడి గురించీ, సూర్యుడి గురించీ వేరే చెప్పాలా? న్యూటన్ కాలంలో కాబోలు, పెద్ద ఓడలు పెరిగాక, దూరంనుంచి వస్తున్న ఓడల స్తంభాలను చూసి, దాన్నిబట్టి భూమి గుండ్రంగా వుందని కొంతమంది వైజ్ఞానికులు ఊహించారు. అలాటి సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారిని ఆనాటి మత ఛాందసులు శిక్షించారు. ఇప్పుడు కూడా భూమి బల్లపరుపుగా వుందనే ఛాందసవాదులు అమెరికాలోనే వున్నారట! కానీ, మన వేదాల్లో ఏముందో చూద్దాం. భూగోళమనీ, చంద్రగోళమనీ వ్యవహరించటం మనకు ఎప్పటినుంచో వుంది. శత పథ బ్రాహ్మణంలో ‘‘పరిమండల ఉ వా అయం లోకః’’అని వుంది. అలాగే కాఠక బ్రాహ్మణంలో
‘‘మండలో వా‚ యం లోకః’’అని వుంది.
జైమినీయ బ్రాహ్మణంలో- భూమే కాదు, సూర్యుడు, చంద్రుడూ కూడా గోళాకారంగా వున్నారని ఈ క్రింది మంత్రంలో విస్పష్టంగా వుంది.
‘‘న ఏష ప్రజాపతిః అగ్నిష్టోమః
పరిమండలో భూత్వా, అనంతో భూత్వాశయే
తదను కృతీదమ్ అపి అన్యా దేవతాః పరిమండలాః
పరిమండల ఆదిత్య? పరిమండలః చంద్రమాః
పరిమండలా ద్యౌః పరిమండలాంతరిక్షమ్
పరిమండలా ఇయం పృథివీ’’
భూమియొక్క ఘన పరిమాణము
భూమి పరిమాణం యాభైకోట్ల యోజనాలని పురాణాలలో వుంది. ఇది ‘‘ఘన పరిమాణం’’అని మనం గుర్తించాలి. భూమియొక్క వ్యాసం సుమారు ఎనిమిది వేల మైళ్లు అని ఈ నాడు సైన్సు చెబుతోంది.
ఒక యోజనము= సుమారుగా 8 మైళ్లు అనుకుంటే భూవ్యాసము వెయ్యి యోజనాలు అవుతుంది. (శ్రీ గొబ్బూరివారి గణనం ప్రకారం యోజనం- 9 మైళ్ళ 160 గజాలు)
కనుక భూవ్యాసార్థము= 500 యోజనాలు (సుమారుగా)

ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి