సబ్ ఫీచర్

కడుపు పండినా వేదనే.. ప్రతి ఐదు నిమిషాలకు ఓ బాలింత బలి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొత్తిళ్లల్లో పసిబిడ్డను చూసుకుని ముద్దులాడాల్సిన బాలింతలు అర్థాంతరంగా అశువులుబాస్తున్నారు. కడుపు పండినా పండంటి బిడ్డను కనే సమయంలో ఎన్నో సమస్యలు తలెత్తి మనదేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక బాలింత కన్నుమూస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5,29,000 మంది బాలింతలు బలవుతుండగా.. ఇందులో మనదేశంలో మరణించేవారి సంఖ్య 1,36,000 అంటే 25.7శాతం అన్నమాట. ఇలా చనిపోతున్నవారిలో మూడొంతుల మంది ప్రసవించిన తరువాతే చనిపోవటం బాధాకరం. ప్రసవ సమయంలో తలెత్తే ఎన్నోరకాల అనారోగ్య సమస్యలు వీరిని ఇలా అకాల మరణాలకు దగ్గర చేరుస్తోంది. బాలింతల మృతి 17.7 శాతం ఉండగా.. ప్రసవ సమయంలో మరణించేవారి సంఖ్య 37.5శాతం ఉంది. ప్రసవ సమయంలో ప్రతి మహిళ 500 నుంచి 1000 మిల్లీలీటర్ల రక్తాన్ని కోల్పోతోంది. ప్రసవించటానికి ముందే అంటే 24 గంటలలోపే గర్భిణీ ఆసుపత్రికి చేరుకుంటే మంచిది. కాని మనదేశంలో సకాలంలో ఆసుపత్రికి తీసుకురాకపోవటం వల్ల ఎక్కువ మంది మహిళలు రక్తస్రావానికి గురై చనిపోతున్నారు. దీంతో ప్రతి లక్షమంది మహిళల్లో 157 మంది వైద్యుల పర్యవేక్షణ లేక చనిపోతున్నారు. వైద్యుల పర్యవేక్షణ లోపం, బాలింతలకు అవసరమైన రక్తాన్ని అందించే బ్లడ్ బ్యాంకులు లేకపోవటం వల్ల కూడా మరణాలు అధికమవుతున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో 1.2 మిలియన్ల మందికి 12 మిలియన్ల యూనిట్ల రక్తం అవసరం. కాని 9 మిలియన్ల రక్తాన్ని మాత్రమే అందించగలుగుతున్నాం. కొత్త ఆశలు, ఊసులతో మమకారాన్ని రంగరించిపోయాలనుకునే తల్లులు పురిట్లోనే కన్నుమూయటం వేదన మిగులుస్తోంది.