Others

బందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ గ్రహంలో
తానొక్కడే ఉంటాడు
పక్కనే పొంచి ఉన్న ఉమ్మ సాగరం
వాడిని తన కళ్లలోకి
జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది...

ఒక పెద్ద తీగ
మరో ప్రపంచపు ఉదయాన్ని, రాత్రిని
ఊపిరిలో బంధించి
మెల్లగా వాడి గుండె గదుల్లోకి
జారవిడవగానే
అమ్మ చేతి తొలి శ్వాస ముద్దను
రుచి చూశాడు...

ఆమె నేత్రాల ప్రదేశంలో
రెండు నల్లటి రంధ్రాలు ఏర్పడ్డాయి
అందులోకి తొంగిచూడగానే
ఒక ఎతె్తైన ప్రదేశంలో
ఆమె నేత్రాలు అతికించబడ్డాయి..
ఆ నేత్రాల నుండి
పచ్చిపువ్వు వాసనొస్తోంది...
ఒక్కసారి ఆ వాసనను
గట్టిగా పీల్చుకుంటే
మరో జీవి చూపుల వర్షంలో
మీ కుహరములు తడిసిపోతాయి...

ఆ పువ్వు
రెక్కలు విప్పకపోతే ఏమైంది?
ఆమె తన కర దుర్భినిలతో
రెక్కలపై నిమరగానే
మరో ప్రపంచం వాడికి దర్శనమిస్తుంది...
అయినప్పటికీ
నీలిబంతిపై నడవాలన్నది వాడి తపన

ఆ అడుగులు
ఇటువైపుగా వస్తున్నాయి..
దయచేసి మీ గుండె పొరల కింద
దాగిన స్వచ్ఛమైన ప్రేమను
వాడి పాదాల అడుగున పరచండి
ధూళి నిండిన ఆలోచనలను
కాలం అవతలి వైపు పాతిపెట్టి
పచ్చని గ్రహాన్ని వాడి గుండెల్లో నాటండి
వాడు ఆ గ్రహాన్ని
మరో తరానికి తీసుకెళ్తాడు...
*

-‘లై’ 9491977190