Others

ఒత్తిడితో పిల్లల్లో దృష్టి సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యం చదువులో ఒత్తిడి, కంప్యూటర్లు, టీవీ వంటివి అతిగా చూడడం వల్ల పాఠశాల స్థాయి విద్యార్థులు దృష్టికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్-ఎ లోపం, అపసవ్య ఆహారపు అలవాట్లు, నేత్ర వ్యాధులను ముందుగా గుర్తించ కపోవడం వంటివి పిల్లల అంధత్వానికి కారణాల వుతున్నాయ. విటమిన్-ఎ పుష్కలంగా లభించే ఆహారాన్ని గర్భిణులు తీసుకుంటే శిశువులు దృష్టి సమస్యలకు దూరం అయ్యే అవకాశం ఉంది. గర్భిణికి మధుమేహం ఉన్నా శిశువులకు దృష్టి లోపం తప్పదని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోని పక్షంలో ఏ వయసు వారైనా మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది. ఫలితంగా వారు దృష్టి సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఏడాదిలో కనీసం రెండు సార్లయినా నేత్ర పరీక్షలు చేయించుకోవడం మంచిది. నేత్ర పరీక్షలు చేస్తున్న సమయంలో మధుమేహం తీవ్రత బయటపడుతుంది. మధుమేహం వల్ల దృష్టి లోపం (డయాబెటిక్ రెటినోపతి) ఏర్పడుతున్న విషయం తొందరగా బయటపడే అవకాశాలు చాలా తక్కువ. కనుక తరచూ నేత్ర పరీక్షలు చేయించుకోవడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.