Others

జగదేక వీరుని కథ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతాళభైరవి, మిసమ్మ, మాయాబజార్ లాంటి అమోఘ విజయాల తర్వాత విజయా వారు ఒక జానపదం నిర్మించాలని తలంచి కె.వి.రెడ్డితో చర్చించడం, కె.వి.గారు, విజయావారి ఆస్థాన రచయిత పింగళి గారితో కలసి ఈ చిత్రం గురించి చర్చించడం నాగిరెడ్డి, చక్రపాణిలకు వివరించడం జరిగింది. అదే ‘జగదేక వీరుని కథ’ చిత్రం. ఎందుకనో చక్రపాణి గారికి అంతగా నచ్చకపోవడం, సందేహిస్తుండటంతో కె.వి.రెడ్డి తాను కూ డా నిర్మాణంలో భాగస్వామినవుతానని విజయాధినేతల్ని ఒప్పించి ఈ చిత్ర నిర్మాణానికి పునాది వేయటం జరిగింది. బహుశా అందుకే కాబోలు ఈ చిత్రం టైటిల్సులో నిర్మాత-దర్శకుడు కె.వి.రెడ్డి అని ఉంటుంది. మహరాజు తన కుమారుని జన్మదినం నాడు ఏం కావాలో కోరుకోమంటే నలుగురు దేవకన్యలతో సంగమాన్ని కోరుకుని వాళ్లను సాధించుకోవడమే చిత్రకథ!
విచిత్రమయిన ఆ కోరికవల్ల మహరాజు కోపానికి గురై, వాళ్ళను సాధించింతరువాతే తిరిగి వస్తానని దేశం విడిచి వెళ్ళిన జగదేవ ప్రతాపుని కథ ఇది. ఇంద్రకుమారి, వరుణకుమారి, అగ్నికుమారి, నాగ కుమారిలను కథానాయకుడు సాధించుకోవడం, శాపం తీరిపోవడంతో ఆ నలుగురు దేవకన్యలు తమతమ దేశాలకు వెళ్ళిపోతే వాళ్లతండ్రులను ఒప్పించి, మెప్పించి తిరిగి తన వారిగా చేసుకోవడం ఆసక్తికరంగా సాగుతుంది. ‘స్క్రీన్’ప్లేలో అపరబ్రహ్మగా పేరున్న కె.వి.రెడ్డి ఈ చిత్రాన్ని నడిపించిన తీరు అతి శ్లాఘనీయం! ముఖ్యంగా ఆయా దేవకన్యల తండ్రులు కథానాయకునికి పెట్టే పరీక్షలు, వాటిని కథానాయకుడు గెలిచి, నిలచిన తీరు అద్భుతం! అందాల రారాజు నందమూరి తారక రామారావు, ఇంద్రకుమారి బి.సరోజాదేవిల జంట కమనీయం, కనులానందం అనిపించింది. ముఖ్యంగా హాస్యానికి చాలా పెద్దపీట వేసిన చిత్రం! ముఖ్య హాస్యజంట రేలంగి, గిరిజలతోపాటు - రాజనాల, సి.ఎస్.ఆర్.ల జంట కూడా హాస్యాన్ని పండించింది. యువరాజు తమ్ముడు లంక సత్యం కూడా హాస్యపు జల్లులు కురిపించాడు. నాగకుమారిగా వేసిన ఎల్.విజయలక్ష్మి నృత్యం కోసం ప్రత్యేకంగా ‘మనోహరముగా మధుర మధురముగా’ అనే పాట చిత్రీకరించడం జరిగింది. పింగళి ఒకరంగా తెరవెనుక హీరో అనొచ్చు! కథ మాత్రమే కాకుండా మాటలు, పాటలు కూడా పింగళిగారి హస్తజనివాలే! ‘ఓ హలా’, ‘హే రాజన్’ లాంటి కొత్త పదాల పరిచయకర్తగా కూడా విజయం సాధించారు. పింగళి సాహిత్యానికి పెండ్యాల స్వర రచన కొత్త అందాలను అద్దింది. ‘జలకాలాటలలో’, ‘ఓ సఖీ ఒహో చెలీ’, ‘అయినదేమో అయినది’, ‘వరించి వచ్చిన మానవవీరుడు’ గీతాలను మనం మరచిపోగలమా? ముఖ్యంగా ఇప్పటికీ ప్రతి తెలుగు గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని పొందిన ‘శివశంకరీ’ పాట పెండ్యాలను, ఘంటసాలను కళాహిమాలయ శిఖరం మీద కూర్చుండపెట్టింది. ఘంటసాల, సుశీలలు ఈ చిత్ర గీతాలకు అమూల్యమైన అలంకరణలు. గోఖలే, కళాధర్‌లు వేసిన జలకాల సరస్సు, ఇంద్ర, నాగలోకపు, మహారాజు మందిరాలు, రాజనాల మందిరం, అగ్నిగుండం సెట్‌లు చిరస్మరణీయాలు. కెమెరా మాంత్రికులు మార్కస్ బార్‌ట్లే పనితనపు గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా ‘శివశంకరి’ పాటలో ఒకే ఫ్రేమ్‌లో నలుగురు రామారావులు కనిపించే సన్నివేశం మార్కస్ మార్కు పనితనానికి అద్భుత నిదర్శనం!! కె.వి.రెడ్డి ధన్యుడు అందుకే 1961లో విడుదలై విజయ దుందుభి మ్రోగించిన ఈ చిత్రమంటే నాకెంతో ఇష్టం!!
-తాడ్డి అప్పలస్వామి, పార్వతీపురం సెల్: 9866479902