Others

రోగాలు తెచ్చే ఆహారం ఇంకెంత కాలం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక యుగంలో అన్ని విషయాల్లో పద్ధతులు మారుతున్నట్లే ఆరోగ్యపు అలవాట్లలోనూ అనూహ్య మా ర్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బయటతినే ఆహార పదార్థాల వల్ల చిన్నారులు పలురకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక విధంగా ఇందుకు తల్లిదండ్రులే కారణమవుతున్నారు. ఒకప్పుడు ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే తినేవారు. నేటి ఉరుకులు, పరుగుల జీవనంలో తిండికి కూడా ఎంతోమంది తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పిల్లలకు ‘జంక్‌ఫుడ్’ అలవాటు చేస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు కొని ఇవ్వకపోతే అది తమ హోదాకు భంగం అని చాలామంది పేరెంట్స్ భావిస్తున్నారు. ఇంగ్లీషులో ‘జంక్’ అంటే చెత్త అని అర్థం. రోడ్లమీద, మురుగు కాల్వల పక్కన పదే పదే కాచిన నూనెతో వండిన పదార్థాలను తిని పిల్లలు రోగాల బారిన పడుతున్నారు. స్నాక్స్ పేరుతో నూడిల్స్, పానీపూరీ, బేకరీ ఐటెమ్స్ ఆరగించే సమయంలో నోటికి ఎంతో రుచికరంగా ఉన్నప్పటికీ చిన్నారులకు ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గడానికి, అధిక బరువు పెరగడానికి, పెద్దల్లో పొట్ట సైజు పెరగడానికి జంక్‌ఫుడ్ కారణమవుతోంది.
శరీరానికి కావలసిన ఎలాంటి పోషకాలు వీటిలో వుండవు. అయితే, కార్బోహైడ్రేట్లు, కొవ్వు వంటి హానికర పదార్థాలతో ఇవి నిండి ఉంటాయి. ఎలాంటి పోషకాలు అందనందున వీటిని తినేవారు త్వరగా అలసటకు లోనవుతారు.
జంక్‌ఫుడ్ ఎక్కువగా తింటే మెదడులో రసాయనాలు మార్పు చెందుతాయి. ఫలితంగా ఒత్తిడికి సంబంధించి లక్షణాలు కనిపిస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆశావహ దృక్పథం, నేర్చుకొనే సామర్థ్యం, చురుకుదనం, ప్రేరణ, జ్ఞాపకశక్తి మందగిస్తాయి. గనుక అధిక కొవ్వులు కలిగి ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం మంచిది. ప్రాసెస్ చేసిన, చాలారోజులు ప్యాకెట్లలో నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం నిద్రలేమి, గర్భస్రావం, సంతానలేమి, కొన్ని రకాల క్యాన్సర్లు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శీతల పానీయాల్లో కెఫిన్, పాస్ఫరిటిక్ ఆసిడ్ మొదలైన రసాయనాలు అధిక మొతాదులో ఉంటాయి. మంచినీళ్ల ప్రాయంగా శీతల పానీయాలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు.
నెలల తరబడి నిల్వ ఉన్న పచ్చళ్ళు తింటే చిన్నపిల్లలకు, గర్భిణులకు ప్రమాదం.
2008లో అమెరికాలో ఆహార పదార్థాలపై ‘కేలరీ లేబుల్స్’ వేయడం ప్రారంభించాక జంక్ ఫుడ్‌కి గిరాకీ తగ్గింది. దీని ప్రభావం తక్కువగానే ఉన్నా, క్రమంగా ఆశాజనకమైన పరిస్థితులు నెలకొంటున్నాయని న్యూయార్క్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలో పెద్దవారిలోను, పిల్లల్లోను ఎన్నడూ లేనంతగా ఊబకాయం సమస్య తలెత్తింది. ప్రతి ముగ్గురు పెద్దల్లో కనీసం ఒకరు, పిల్లలు, టీనేజర్లలో 17 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. పిజ్జాలు, బర్గర్లు తినే వారు ఏ వయసుకు చెందినప్పటికీ జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదముందని కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో విశ్వవిద్యాలయం పరిశోధకు లు హెచ్చరిస్తున్నారు. జంక్‌ఫుడ్‌ను అధికంగా తింటున్న సుమారు వెయ్యిమంది ఆరోగ్య పరిస్థితులను విశే్లషించగా- చాలామందిలో జ్ఞాపకశక్తి తగ్గుతోందని వెల్లడైంది. జంక్ ఫుడ్‌లో ఉండే ప్రో ఆక్సిడెంట్లు కణశక్తికి వ్యతిరేకేంగా పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. తద్వారా శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, మెదడు పనితీరు మందగిస్తుందని అంటున్నారు.
ఈ కాలపు పిల్లలు పిజ్జాలు, బర్గర్లకు ఇంతలా దాసోహం అవడానికి సోషల్ మీడియా కూడా ఓ కారణమని సిడ్నీ (ఆస్ట్రేలియా)లో జరిగిన ఓ సర్వే వెల్లడించింది. జంక్‌ఫుడ్‌కు సంబంధించి ఫేస్‌బుక్ తదితర సోషల్ సైట్లలో మార్కెటింగ్ ఎక్కువగా ఉంటోందని, వీటిపై పిల్లలు అమితమైన ఆసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. శీతల పానీయాలకు సంబంధించిన ఫేస్‌బుక్ పేజీలను టీనేజ్ పిల్లలు ఎక్కువగా ‘లైక్’ చేస్తున్నట్లు తేలింది.
జంక్‌ఫుడ్ నుండి మనకు లభించేవి 100 శాతం ఎల్‌డిఎల్ (అనవసరపు కొవ్వులు). సాధారణంగా జంక్ ఫుడ్‌లో జంతు సంబంధిత నూనెలు, కొవ్వులు, సోడియం, బేకింగ్ సోడా, నిమ్మ ఉప్పువినియోగిస్తారు. , వీటికితోడు దుమ్ము, ధూళి కూడా తోడవుతుంది. ఫలితంగా కడుపులో అల్సర్లు ప్రారంభమవుతాయి. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ, వారు యుక్తవయస్సు వచ్చేసరికి గ్యాస్, ఎసిడిటీ, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదాలు ఎక్కువ. గనుక పిల్లలకు జంక్‌ఫుడ్ బదులు పండ్ల రసాలు, పెరుగు, మజ్జిగ వంటివి అలవాటు చేయాలి.
నిషేధం ఎక్కడ?
స్కూల్ హాస్టళ్లలో, క్యాంటీన్లలో, పరిసర ప్రాంతాల్లో జంక్ ఫుడ్ అమ్మడం, అందుబాటులో ఉంచడాన్ని నియంత్రిస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) గతంలోనే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులకు పోషకాలున్న ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని, పాఠశాల ప్రాంగణానికి 50 మీటర్ల పరిధిలో జంక్‌ఫుడ్ విక్రయాలను నియంత్రించాలని ఆదేశించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల తలెత్తే దుష్పరిణామాలపై పిల్లలకు తగిన అవగాహన కల్పించాలని కూడా ఆదేశాలున్నా అవి అమలవుతున్న దాఖలాలు కనిపించవు.

-వినీతామూర్తి