Others

పాముతో నేస్తం! ( శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధు జంతువులు, పులిలాంటి క్రూర జంతువుతో -ఇదే శీర్షికలో నటి జమునను చూసేవుంటారు. ఈవారం మరో ఫొటోతో కళాభారతిని చూడండి. నాగులచవితి (1956) చిత్రంలో జమున పోషించిన మరపురాని పాత్ర ఒకటి అందరికీ గుర్తుండేదే. ఆ రోజుల్లో పాత్రధారులు నిజమైన పాములతో పాత్రకనుగుణంగా నటించి మెప్పించారు. అందుకే అలనాటి చిత్రాలను నేటితరం ఇప్పటికీ చూసి ఆనందిస్తున్నారు. ఈ అనుభవం గురించి జమున వివరిస్తూ -్భర్త ప్రాణాలను అపహరించటానికి తక్షకుడు పామురూపంలో రానున్నాడని తెలుసుకుని భర్తను రక్షించుకునే కథానాయిక పాత్ర జమునది. పాత్రపరంగా సన్నివేశంలో -్భర్త నిద్రిస్తున్న మంచం కోడువద్ద బలవంతంగా నిద్ర ఆపుకొని జాగరణ చేస్తుంటుంది. పాము మంచం కోడువద్దకు చేరగానే తలకింద భాగంలో చేత్తో పట్టుకోవాలి. నిజానికి పామును
చేత్తో తాకటంతో వళ్ళంతా గగుర్పాటుగా అనిపించింది. దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి సూచనతో ఎలాంటి సంకోచం లేకుండా చేతితో గట్టిగా పట్టుకొని అదుపులోకి తీసుకొని షాట్ ఓకే
అనిపించుకోగలిగాను. మళ్ళీ చాలాకాలం తర్వాత సతీ అరుంధతి (1968) చిత్రంలో నటించే సమయంలో అదే స్టూడియోలో తమిళ చిత్రం షూటింగ్ జరుపుతున్న శాండో చిన్నప్పదేవర్ క్రూర జంతువుతో మచ్చిక చేయించి భయం పోగొట్టారు. సన్నివేశాన్ని పండించేందుకు జమున పాముతో
సయ్యాటలాడుతూ అలవాటుపడుతున్న సమయంలో తీసిన చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717