Others

కళ్యాణ్‌రామ్‌తో నాగార్జున మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో వరుసగా మల్టీస్టారర్ సినిమాల హవా జోరుగా కొనసాగుతుంది. అయితే పెద్ద హీరోలు ఇద్దరు కలిసి ఈ మల్టీస్టారర్ సినిమాలు చేయకుండా యంగ్ హీరోలతో జత కడుతున్నారు. ఇప్పటికే వెంకటేష్, మహేష్, రామ్‌లతో మల్టీస్టారర్స్ చేశాడు. తాజాగా వరుణ్ తేజ్‌తో సినిమా మొదలుపెట్టాడు. ఇక నాగార్జున కూడా నానితో ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు. తాజాగా నాగార్జున మరోసారి మల్టీస్టార్‌కు ఓకె చెప్పాడు. అయితే ఈసారి ఆయన కలిసి నటించేది ఎవరో తెలుసా.. కళ్యాణ్‌రామ్. అవును అక్కినేని, నందమూరి హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటించేందుకు రంగం సిద్ధం అయింది. ఇదివరకే అక్కినేని-నందమూరి హీరోలుగా నాగార్జున, హరికృష్ణ కలిసి సీతారామరాజులో నటించారు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న పవన్ సాదినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని, ఇప్పటికే నాగార్జునతో కూడా చర్చలలు జరిపినట్టు టాక్. కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం గుహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అటు నాగార్జున కూడా నానితో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యక ఈ మల్టీస్టారర్ సెట్స్‌పైకి రానుంది. అన్నట్టు ఈ చిత్రాన్ని కళ్యాణ్‌రామ్ నిర్మిస్తాడట.