Others

ప్చ్..రెజీనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెజీనా..టాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం ఇక నోఛాన్స్! అంటున్నారు పరిశ్రమ పెద్దలు. ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆలోచనలతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీకి కాలం కలిసిరావట్లేదు. అప్పుడప్పుడు ఒకటీ ఆరా చిత్రాలు చేస్తున్నా.. ఎందుకనో అనుకున్నంతగా బ్రేక్ మాత్రం దరిచేరడం లేదు. కొత్తనీరు ప్రవేశించడం.. యువతరం హీరోలు వారివైపునకే చూస్తుండటంతో రెజీనా పరిస్థితి ఇలా తయారైంది. నటించినవి కొన్ని చిత్రాలే అయినా, ఆయా చిత్రాల్లో రెజీనా నటిగా మంచి మార్కుల్నే కొట్టేసింది. కెరీర్ ఆశాజనకంగా ఉంటుందనుకుంటున్న సమయంలో పరిశ్రమలోకి కొత్తతరం రాకెట్‌లా దూసుకొచ్చింది. ఫలితంగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయినా ఆమెలో ఇంకా ధైర్యం చావడం లేదు. ఎప్పటికైనా తన పవరేంటో చూపిస్తానంటోంది. చూద్దాం.. ప్చ్..రెజీనా!