Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోళము యొక్క ఘన పరిమాణానికి సూత్రం-
= 4/3x నిన్గి3
కనుక భూ ఘన పరిమాణము= 4/3x 22/7 x 500 x 500 x 500
= యాభై రెండు కోట్ల ముప్ఫై ఎనిమిది లక్షల తొమ్మిది వేల అయిదు వందల ఇరవైమూడు చిల్లర ఘన యోజనాలు! భూమి పూర్తిగా గోళాకారంగాకాక ధ్రువాల దగ్గర నొక్కుకుని వుంది. కనుక, దీన్ని దగ్గర అంకెకు రౌండు చేస్తే భూ ఘన పరిమాణం యాభై కోట్ల యోజనాలని చెప్పటం సముచితమే గదా!
భూమి బయటి ఆకారం మాత్రమేగాక, భూమి లోపల పొరల గురించి కూడా భారతీయ వైజ్ఞానికులకు సుస్పష్టంగా తెలుసుననటానికి, వేదంలోనే నిదర్శనాలున్నాయి. ఇవాల్టి జియాలజీ, భూమి లోపలి పొరలలో భగభగా మండిపోతున్న ఉష్ణద్రవాలు ఉన్నాయని చెపుతోంది.
సుమారుగా పై యాభై కిలోమీటర్లు మాత్రమే గడ్డకట్టిన గట్టి పొరగా వుందనీ, ఇంకా లోతుకు పోయినకొద్దీ 1200 డిగ్రీల సెంటిగ్రేడు నుండి 1800c (డిగ్రీల సెంటిగ్రేడు) దాకా వేడి పెరిగిపోయి, కొండరాళ్లు కూడా కరిగి ద్రవరూపంలో వున్నాయనీ, ఇవాల్టి సైన్సు నిరూపిస్తోంది. ఈ విషయాన్ని యజుర్వేద సంహిత ఎంత అందంగా చెబుతోందో చూడండి.
‘‘మాతా పుత్రం యథోపస్థే సాగ్నిం బిభర్తు గర్భ ఓమ్’’॥ (తల్లి తన ఒడిలో) పిల్లవాణ్ణి ధరించినట్లుగా భూమి తన గర్భంలో అగ్నిని ధరిస్తోంది.)
శత పథ బ్రాహ్మణం కూడా ఈ మాటే చెబుతోంది.
‘‘యథా మాతా పుత్రముపస్థే బిభృయాదేవ మగ్నిం గర్భే బిభర్త్వితి (ఇంచుమించు పైవాక్యార్థమే)
తైత్తిరియ సంహితలో ప్రజాపతికీ, భూదేవికీ జరిగిన సంభాషణ రూపంగా మరొక విశేషం కూడా వుంది.
భూగర్భంలో వున్న ఉష్ణోగ్రత భూమి ఉపరితలంలో ఉన్న చల్లదనంవల్ల ఎప్పటికప్పుడు బాలెన్సు అవతూ వుందని చెప్పటానికి, ఒక చిన్న సంవాదకల్పన చేయబడింది.
ప్రజాపతి రగ్ని మచికీషత
తం పృథివ్య బ్రవీత్ - న మయ్యగ్నిం చేష్యసే తి మా థక్ష్యితి
సాత్వాతి దహ్యమానా విధవిష్యే
స పాపీయాన్ భవిష్యసీతి
సో బ్రవీత్
తథా వా అహం కరిష్యామి యథా త్వా నాతి దక్ష్యతీతి
స ఇమా మభ్యమృశత్
ప్రజాపతిస్త్వా సాదయతు
తయా దేవతయాంగిరస్వద్ ధ్రువా సీద
ఇతీమామేవేష్టకాం కృత్వోపాధత్తానతిదాహాయ
భూమి:ఓ ప్రజాపతీ! నీవు నాలో అగ్నిని ఉంచుతున్నావు. అది నన్ను దహించగలదు. దానివల్ల నీకు పాపం రాగలదు.
ప్రజాపతీ: ఓ భూమీ! ఈ అగ్ని నిన్ను అతిగా దహించని రీతిలో వ్యవస్థ చేస్తాను. ఇలా అని ప్రజాపతి భూమిని స్పృశించెను. దానివల్ల భూమికి అతి ఉష్ణము లేకుండా సమతులత కలిగెను.
వేదం సూటిగా సైన్సు చెప్పటం కోసం వచ్చిన గ్రంథం కాదు. అందువల్ల వివరాలన్నీ ఇక్కడ లేకపోవచ్చు. కానీ ఆనాటివైజ్ఞానికులకు ఈ వివరాలన్నీ తెలుసునని మనం దీన్ని బట్టి ఊహించవచ్చు.
భూ అయస్కాంత శక్తి
నాలుగు వందల సంవత్సరాల కిందట న్యూటన్ భూమి ఒక అయస్కంతం అని నిరూపంచాడనీ, అప్పటిదాకా మనకు ఆ విషయం తెలియనే తెలియదనీ మనం అనుకుంటూ వుంటాం.
కానీ ఋగ్వేదం భూమిని ‘అయసీ’ అని వ్యవహరిస్తోంది. ఐతరేయ బ్రాహ్మణంలో-
‘‘తే (అసురా) వా అయస్మరుూం
ఏవ మాం పృథివీం అకుర్వన్
ఇక్కడ ‘అయస్మరుూం’ అనగా ‘లోహయుక్తామ్’ అని వ్యాఖ్యనము. అనగా ‘పృథివిని అయస్కాంత ఆకర్షణ కలిగినదానినిగా చేసిరి’ అని అర్థం.
కౌషీతకీ బ్రాహ్మణంలో ఇలా వుంది (అసురాః)
‘అయస్మరుూం పురీం అస్మిన్ అకుర్వన్’
తైత్తిరీయ బ్రాహ్మణం కూడా ఇంచుమించు ఇలాగే చెపుతోంది.
‘అస్య వై (్భ) లో కస్య రూపం అయస్మయః సూచ్యః’
అయస్మయ సూచ్యః అంటే అయస్కాంత శకలములు అనే అర్థం.
ఈ విధంగా వేదాలలో భూమికి సంబంధించిన అనేక వైజ్ఞానికాంశాలను మనకు దర్శనం ఇస్తున్నాయి.
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి