AADIVAVRAM - Others

శుభ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన జీవితంలో ఉదయం చాలా ముఖ్యమైంది. లేవగానే చాలామంది పెద్దవాళ్లు భూమికి దండం పెట్టి లేచేవాళ్లు. సముప్ర వసనే దేవి... అంటూ ప్రార్థన చేసి రోజువారీ కార్యక్రమాలు మొదలుపెట్టేవాళ్లు. భూమి దేవతనా కాదానన్న విషయం ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. భూమి మనల్ని రోజంతా మోస్తుంది. మరో రోజు మనకి భూమి మీద నివసించడానికి అవకాశం లభించింది. అందుకైనా దండం పెట్టడం అవసరం.
లేవగానే పండ్లు తోముతాం. గడ్డం తీస్తం. గోర్లు పెరిగితే వాటిని కత్తిరిస్తాం. మగవాళ్లు తమని తాము శుభ్రం చేసుకొని తయారు కావడానికి ప్రతిరోజూ నలభై నిమిషాలు వెచ్చిస్తారని, ఆడవాళ్లు ఓ గంటసేపు వెచ్చిస్తారని ఓ అంచనా. ఇది అవసరమే. కాదనలేం.
బయటకు కన్పించే గోర్లు, పండ్లు, ముఖం లాంటివి శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో, బయటకు కన్పించని మనస్సుని, మెదడుని, హృదయాన్ని శుభ్రం చేసుకోవడం అంతకన్నా ముఖ్యం. గడచిన రోజున మనతో ఘర్షణ పడ్డ వ్యక్తులు మనం లేవగానే గుర్తుకొస్తారు. వాళ్లని తిడుతూనో, కోపగించుకుంటూనో మనం ఉదయాన్ని ప్రారంభించకూడదు. దానివల్ల వ్యతిరేక భావనలు మొదలై శరీరంలో అనవసర రసాయనాలు ఉత్పత్తి అయి మన శరీరాన్ని పాడు చేస్తాయి.
నీటిలో మురుగునీళ్లు వస్తే వాటిని పారబోస్తాం. పాలు విరిగిపోతే మరో రకంగా దాన్ని ఉపయోగించుకోవడానికి ఉపయోగిస్తాం. లేదా పారబోస్తాం. మన వ్యతిరేక భావనలని కూడా ప్రతి ఉదయం తొలగించి మంచి ఆలోచనలతో ప్రారంభించాలి.
ఉదయాన మంచి సంగీతం వినాలి. మంచి విషయాలు తలచుకోవాలి. చెడు భావనలని తొలగించాలి. మన శరీరాన్ని శుభ్రపరచుకోవడం ఎంత ముఖ్యమో మన మనస్సుని, హృదయాన్ని, మెదడుని శుభ్రం చేసుకోవడం అంతకన్నా ముఖ్యం.
మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి వెచ్చించే సమయాన్ని మంచి భావనలు రావడానికి కూడా ఉపయోగించుకోవాలి. అందుకోసం మంచి విషయాలని తలచుకువాలి. మంచి పాటలు వినాలి. మంచి అనుభవాలని గుర్తుకు తెచ్చుకోవాలి.
మనకు లేని వాటిని గుర్తుకు తెచ్చుకొని విచారించడంకన్నా, మనకు వున్న వాటిని గుర్తుకు తెచ్చుకొని సంతోషపెట్టడం ఇంకా ముఖ్యం.
భూమికి దండం పెట్టడంతో ఉదయాన్ని ప్రారంభిద్దాం.