Others

నిద్ర సమస్యే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిశువును ప్రసవించిన తర్వాత తల్లులు కనీసం నాలుగు నెలల పాటు నిద్రలేమితో బాధపడుతున్నారని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిద్రను దూరం చేసుకోవాలనుకోవడం కన్నా, శారీరక శ్రమకు తల్లులు దూరంగా ఉండడం మేలని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రసవం తర్వాత ఉద్యోగినులు నాలుగైదు నెలలు సెలవు తీసుకోవడం మేలని, సాధారణ గృహిణులు ఇంటిపనులకు దూరంగా ఉండడం మంచిదని వారు సలహా ఇస్తున్నారు. నిద్రలేమి సమస్య వల్ల ప్రసవానంతరం ఎంతోమంది తల్లులు అనారోగ్యం బారిన పడుతున్నారని అధ్యయనంలో తేటతెల్లమైంది. మగతగా ఉన్నపుడు నిద్రను వాయిదా వేసుకోవడం తగదంటున్నారు. శారీరక శ్రమకు దూరంగా ఉంటూ తల్లులు తగినంత సేపు నిద్ర పోవడం అలవరచుకోవాలని వారు సూచిస్తున్నారు. పగటిపూట నిద్ర తల్లులకు ఎంతో మంచిదంటున్నారు. శిశువు సంరక్షణ, ఇతర బాధ్యతల కారణంగా చాలామంది తల్లులు రాత్రి వేళ కూడా తగినంతగా నిద్రపోవడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రసవం తర్వాత కనీసం 18 నెలల పాటు తల్లులకు తగినంత నిద్ర లేకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. శిశువు సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తూనే తల్లులు నిద్ర ప్రాధాన్యతను కూడా గుర్తించాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.