Others

మసకబారని సూర్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంకంలో నిలిచిన పద్మంలా
కాలుష్య సమాజంలో ఒక నిర్మలుడు
వాడికి నింగి లక్ష్యం
దశదిశల నుండి వీచే
స్వేచ్ఛావాయువులతో
ప్రాణం నిలుపుకొంటాడు వాడు
వాణ్ణి కలుషితం చేయాలని
పదేపదే యత్నించేవారెందరో!
ఎవరికీ చిక్కని పాదరసం వాడు
తామరాకు మీద నీటిబొట్టువాడు
హిమశిఖరాలపై నుండి దూకిపడే
గంగానది లాంటిది వాడి గమనం!
వాడెప్పుడూ మసకబారని సూర్యబింబం!
వాడి వెలుగే జగతికి ఆలంబనం!!
*

-డా.అయాచితం నటేశ్వరశర్మ 9440468557