Others

పుట్టుకే ప్రశ్నార్థకమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇంటికి దీపం ఇల్లాలే’ అంటూ ఘనంగా కీర్తించే మన పుణ్యభూమిలో ఆడపిల్లల విషయంలో మాత్రం అమానుషమైన వివక్ష కొనసాగుతోంది. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు ఆడపిల్ల కాళ్లకు పట్టీలు పెట్టుకొని చిరు సవ్వడి చేస్తూ తమ ఇంట తిరుగుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే ఉండేది కాదు. లక్ష్మీదేవే తమ ఇంట నడయాడుతోందని మురిసిపోయేవారు. కాని నేడు ఆ పరిస్థితి లేదు. ఆడపిల్ల పుడితే ఎంతో భారమని బాధపడే తల్లిదండ్రులే ఎక్కువయ్యారు. ఫలితంగా కడుపులోనే ఆడ శిశువులను కడతేర్చుతున్నారు. భారత్‌లో ఆడపిల్లల సంఖ్య నానాటికీ తీసికట్టుగా మారిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక తెలియజేస్తోంది. మన దేశంలో ఆడపిల్ల పుట్టుకే ప్రశ్నార్థకంగా మారిందని ఆ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని కుటుంబాలలో ఆడపిల్ల కనుమరుగవుతుందని పేర్కొంది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో ఆడపిల్లల జననాల రైటు రెండు శాతం కంటే ఎక్కువగా లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సామాజక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఆడపిల్లలు, మగపిల్లలు ఇరువురూ కావాలని, కాబట్టి ప్రతి కుటుంబంలో ఒక అబ్బాయి, ఒకఅమ్మాయి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతోమంచిదని అమెరికాకు చెందిన వైద్యుడు డాక్టర్ మేరీ ఇ.జాన్ అంటున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఆడపిల్లల పుట్టుక జీవన్మరణ సమస్యగా మారింది. తల్లిదండ్రులకు సలహా ఇచ్చే వైద్యులు సైతం కరువయ్యారు. చదువుల విషయానికి వస్తే లింగ వివక్ష నేటికీ కొనసాగుతోంది. రాబోయే కాలంలో ఇదే వివక్ష కొనసాగితే సామాజిక వ్యవస్థలో అసమానతలు అని వార్యమవుతాయని, ఇప్పటికైనా ఆడపిల్లల విషయంలో అపోహలు విడనాడాలని ఐక్య రాజ్య సమితి నివేదిక ఘోషిస్తోంది. *