Others

నిత్యం వినాయక చవితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయకచవితి రోజు అనయ కుటుంబ సభ్యులంతా వినాయకుడికి పత్రితో పూజ చేశారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా భోజనం అయ్యాక టీవీ చూస్తున్నపుడు అనయ అడిగింది.
‘‘అతను ఎవరు? అంతా ఎందుకు ఏడుస్తున్నారు?’’
‘‘అది ఏడుపు కాదు, సంతోషం. అతను సంవత్సరం క్రితం తీర్థయాత్రకు వెళ్లినపుడు తప్పిపోయాడు’’ అనయ తండ్రి చెప్పాడు.
‘‘అవునవును, గుర్తొచ్చింది. తన కుటుంబ సభ్యులతో శ్రీశైలం వెళ్లి అక్కమహాదేవి గుహల దగ్గర ఎవరో తప్పిపోయారనే వార్త నాకు గుర్తుంది’’.
‘‘నిన్నటిదాకా తలకి తగిలిన దెబ్బతో అతను తన గతాన్ని మర్చిపోయాడు. గుర్తురాగానే తన వాళ్ళని వెతుక్కుంటూ తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చేదాకా వాళ్ళు ఎంత బాధపడ్డారో? మనం ఇది టీవీలో ఓసారి చూసాక ఆ రోజే మర్చిపోయాం. కాని అతని కుటుంబ సభ్యులో? గత ఏడాదిగా వాళ్ళు నిత్యం అతన్ని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు’’.
కొద్దిసేపటి తర్వాత అనయ తండ్రిని అడిగింది.
‘‘ఏమిటి నాన్నా ఆలోచిస్తున్నావు?’’
‘‘మన గురించే. వినాయకుడు మన దేవుడు. కానీ ఆయన్ని ఈరోజు మాత్రమే గుర్తుంచుకుని రేపటికల్లా మర్చిపోతాం. ఆ ఇంటికి అతను పెద్ద. పైగా కుటుంబ సభ్యుడు కాబట్టి అతన్ని నిత్యం గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. మరి అంతకన్నా ఎక్కువైన వినాయకుడ్ని మనం నిత్యం స్మరించడం లేదంటే, మనకి దేవుడితో బలమైన సంబంధం లేనట్లేగా?’’
‘‘దేవుడ్ని స్మరించడం ఎలా నాన్నా?’’
‘‘అది భక్తిలోంచే పుడుతుంది. భక్తిపరులు సదా దేవుడ్ని స్మరిస్తూనే ఉంటారు. మనకి దేవుడితో దగ్గరి సంబంధం లేదు. ఉంటే మనం ఇంకాస్త భద్రతతో, ఇంకాస్త ఆనందంగా జీవించగలం’’ తండ్రి చెప్పాడు.
‘‘అర్థమైంది. అతను వారికి బాగా తెలుసు. అతనంటే ప్రేమ కాబట్టి రోజూ గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. అతను తిరిగి రాగానే ఎంతో సంతోషపడ్డారు. కాని మనం మట్టి వినాయకుడ్ని నీళ్లలో కలిపేసాక ఇక మళ్లీ వినాయక చవితి దాకా ఆయన్ని గుర్తుంచుకోవడం లేదంటే వినాయకుడంటే మనకి ప్రేమ లేకపోవడమే కారణం’’ అనయ చెప్పింది.
‘‘సంబంధం లేకపోవడం కూడా. భక్తిని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నీకు ఇపుడు అర్థమైంది కదా?’’ తండ్రి అడిగాడు.
‘‘ఐంది. దేవుడితో బాంధవ్యం పెంచుకోగలితే అది సాధ్యం అవుతుంది’’.
మర్నాటినించి అనయ స్కూల్‌కి వెళ్లేటపుడు పింగాణీ వినాయకుడికి దణ్ణం పెట్టుకుని వెళ్ళడం, రాగానే తిరిగి నమస్కరించడం అలవాటు చేసుకుంది.