Others

నాకు నచ్చిన సినిమా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1974లో హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు విడుదలై ఘన విజయం సాధించింది. ఆ చిత్రం తర్వాత కృష్ణ నటించినవి దాదాపు 14 సినిమాలు అపజయం పాలయ్యాయి. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుకొని, 1976లో స్వంత బేనర్‌లో ‘పాడిపంటలు’ తీసి విజయాన్నందుకున్నారు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సినిమాలో ఎద్దులు చేసే విన్యాసాలు ఆసక్తిని కల్గిస్తాయి. కృష్ణ విజిల్ వెయ్యగానే స్వయంగా బండి మొకరాను తమ మీదకు తీసుకోవడం, నదిలో జగ్గయ్య, కృష్ణ మొదలగు వారుండిన పడవను తాళ్ళతో ఒడ్డుకు లాగడం చాలా బాగుంటుంది. విజయనిర్మల దగ్గరున్న పొట్టేలు హాస్యం కురిపిస్తుంది. నడి వీధిలో సూర్యకాంతం, ఛాయాదేవి ఆవుల పేడకోసం కొట్టుకోవడం, ఆనాటి గ్రామసీమల్లో తరచుగా కనిపించేదే!
ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ సీలేరు డ్యాం. ఈ సినిమా నిర్మాణ సమయానికి అక్కడ డ్యాం కడుతున్నారు. కృష్ణ వాటిని తన సినిమాకు చక్కగా వాడుకున్నారు. ఆ దృశ్యాలన్నీ ఆకట్టుకుంటాయి. ఈ డ్యాం దగ్గర ‘పనిచేసే రైతన్నా... పాటుబడే కూలన్నా...’ పాట చిత్రీకరించారు. ఈ పాట ఎంతో బాగుంటుంది. ఈ సినిమాలో కుటుంబం కోసం ఇంటి పెద్దవాడు పడే పాట్లు, తమ్ముడు అడ్డదారులు తొక్కడం. ఇంటి చిన్నకోడలు అహంకారంతో ప్రవర్తిస్తే చివరకు ఆమె పరిస్థితి ఎలా ఉంటుందన్నది లత ద్వారా మనకు చూపిస్తారు.
ఈ సినిమాలో ప్రతీ సీన్ చాలా బాగుంటుంది. పచ్చని పల్లెలు కనువిందు చేస్తాయి. మన జన్మభూమి..బంగారు భూమి పాట చాలా బాగుంటుంది. కృష్ణ నటన బాగుంటుంది. అందుకే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.

-మల్లారెడ్డి రామకృష్ణ, శ్రీకాకుళం