Others

నిదురించే తోటలోకి... నాకు నచ్చిన పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముత్యాలముగ్గు’ సినిమాలోని ఈ పాట నాకు ఎంతో ఇష్టం. గుంటూరు శేషేంద్రశర్మగారు వ్రాసిన ఒకే ఒక్క సినిమా పాట. అద్భుతమైన సాహిత్యం, కె.వి.మహాదేవన్‌గారి అమృత తుల్యమైన సంగీతం, సుశీలగారి ఆర్ద్రతగల కంఠం, బాపుగారి సహజ చిత్రీకరణ, విశాల నేత్రి సంగీత నటన ఇవన్నీ కలిసి ఈ పాటను అజరామరం చేశాయి.
ఇందులోని పల్లవి, చరణాలు మనకు సినిమామొత్తం కథను విపులీకరిస్తాయి. ‘కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది’ అనటంలో ఆమె దుఃఖాన్ని బాపే సంఘటన జరిగిందని చెప్పటం.

‘వికలమైన నా కోర్కెలు వ్రేలాడే గుమ్మంలో... ఆశల అడుగులు వినపడి అంతలోనే పోయాయి..’ తన భర్త (దూరమై ఉన్నాడు) ప్రస్తుతం అలా కనిపించి ఇలా మాయమయ్యాడు. ‘నది తోసుకుపోతున్నా నావను ఆపండి’ అంటుంది హీరోయిన్ ఆర్తిగా. ఆ నావలో తన భర్త ఉన్నాడు. అతన్ని తన దగ్గరికి చేర్చమని నదిని కోరుకుంటోంది. ప్రార్థిస్తోంది. ‘రేవు బావురుమంటోందని ఆ నావకు చెప్పండి’అంటూ వికలమనస్కురాలై గోడుని వ్యక్తపరుస్తుంది. ఎన్నిసార్లు విన్నా ఈ పాటలోని మాధుర్యం చెక్కుచెదరక పోవటం- ఆ పాటలోని విశిష్టత. నాకు అందుకే అంత ఇష్టం!

-పసుపులేటి శివశంకర సాయిప్రసాద్, నెల్లూరు