ప్రకాశం కథలు

మహాత్ముడు - మహానుభావుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ కాల పరిస్థితులు, విప్లవ జ్వాలలు ఎందరో యుగ పురుషులకు, మహానుభావులకు జన్మనిస్తుంది అనడానికి తార్కాణం 19వ శతాబ్దమే. అనేక మంది మేధావులను, మహా నాయకులను, ఆధ్యాత్మిక శక్తివంతులను, రాజనీతిజ్ఞులను, కళాకారులను, కవులను, త్యాగధనులను భారతదేశానికి సమర్పించింది 19వ శతాబ్దం. ఇలాంటి మహాపురుషులలోని వారే మహత్మాగాంధీ, ఆంధ్రకేసరి ప్రకాశం.
తమ శక్తి సామర్థ్యాల చేత, స్వయంకృషితో దేశాన్ని ఉర్రూతలూగించారని, వారు కారణజన్ములని నిస్సందేహంగా చెప్పవచ్చును. జాతిపిత బోధనలు సర్వమానవాళికి అంగీకారమైనాయి. గాంధీజీ ప్రభావం దేశ విదేశీ ప్రజలలో ఏ విధంగా ప్రభావితమైందంటే ఆ రోజుల్లో ఆయనను విభేదించినంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క రాజకీయ జీవితం అంతమైనట్లే. అలాంటిది కాంగ్రెస్‌లో ఉంటూ గాంధీని ఎదిరించి తన స్వయంశక్తి మీద నిలబడి, తన పలుకుబడితో, తన సహజ ధీరత్వంతో ఏకంగా మహాత్ముడికే ఆదర్శుడైనాడు. తన స్వయంకృషి వలన, ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుడైన వ్యక్తి గాంధీగారని అందరూ నమ్ముతారు. కానీ, కటిక పేదరికాన్ని అనుభవించి, బారిస్టరు వరకు చదివి, లక్షలాది రూపాయలు సంపాదించి గాంధీగారి పిలుపు మేరకు దేశ విమోచనకూ, క్షేమానికి, కాంగ్రెస్ సిద్ధాంత సాధనకు సర్వం త్యాగం చేసిన మహానుభావుడు ప్రకాశం. ఈయన కూడా గాంధీజీలాగే స్వయంకృషి వలన ప్రభావితుడని వీరి జీవితాన్ని తెలుసుకున్నవారు అంగీకరించక తప్పదు.
గాంధీగారి ప్రభావానికి లోనై అనేక మంది మేధావులు, విద్యావంతులు, స్వాతంత్య్రం కోసం వారి వారి సర్వస్వాన్ని అర్పించారు. అయితే ప్రకాశం గారి లాగా నూటికి నూరుపాళ్లూ గాంధీయిజాన్ని జీర్ణించుకొని, సామాన్య జన బాహుళ్యాన్ని తనతో కూడా తీసుకొని ముందుకి సాగగల్గిన ప్రజా నాయకుడు వేరొకరు లేరు. అంతేకాదు గాంధీజీ శిష్యుడిగా, అనుచరుడిగా, సహచరుడుగా, కాంగ్రెస్ కార్యకర్తగా ఆశయసిద్ధి ఓకసం పరితపిస్తూ కూడా అవసరమైనప్పుడు తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే వచ్చారు. ఒక సత్యాన్ని నిర్మొహమాటంగా చెప్పడంలో గాంధీజీని కూడా లెక్కచేయని సందర్భాలూ ఉన్నాయి. ‘నిష్కల్మష దేశభక్తి, త్యాగనిరతి, చిత్తశుద్ధి, ధైర్యసాహసాలు, నిరంతర ప్రజాసేవ గల ప్రకాశం వ్యక్తిత్వాన్ని చూసి గాంధీజీ వంటి మహానాయకులు కూడా ఒక్కొక్కప్పుడు చకితులయ్యేవారు...’ గోపరాజు వెంకటానందం ‘గాంధీజీ - ప్రకాశం’ అనే వ్యాసంలో 1972 పంతులుగారి శతజయంతి సంచికకు పంపించిన సందర్భంలో రాశారు.
1946వ సం.లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసి తరుణంలో ప్రకాశం గారికి ఎక్కువ శాసనసభ్యుల బలమున్నప్పటికీ గాంధీజీ, కాంగ్రెస్ హైకమాండ్ రాజాజీని గెలిపించాలని చూశారు. అయినా వారిద్దరినీ ఎదిరించి, ముఖ్యమంత్రి కాగలిగారంటే ప్రకాశం ప్రతిభ, ఎంతటి ప్రజాదరణ ఉందో తెలుస్తుంది. ఇది ఆ రోజులలో సామాన్యమైన విషయం కాదు.
గాంధీజీని ఎదిరించి ముఖ్యమంత్రి అయినా నిర్మాణ కార్యక్రమాన్ని (గాంధీగారు ప్రతిపాదించిన, మానస పుత్రిక అయినటువంటిది) పూర్తిగా నమ్మిన కాంగ్రెస్ భక్తుడిగా ప్రకాశం పంతులు కావడం కారణంచేత, రాష్టమ్రంతా ఫిర్కా అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పి తద్వారా ఖద్దరు పరిశ్రమకు, గ్రామీణ పరిశ్రమలకు ఎంతో పాటుపడ్డారు. ‘మద్రాస్‌కు నీవు ప్రధానమంత్రిగా కానీ, సాధారణ మంత్రిగా కానీ ఉండకూడదని నా నిశ్చితాభిప్రాయం. శాసనసభలో నీవు వెనుక వరసలో కూర్చోవలసినదే’ అని ప్రకాశంను ఆజ్ఞాపించిన మహాత్ముడే ఆరు నెలలు గడిచిన తరువాత ప్రకాశంగారి పరిపాలనా దక్షత, దీక్షను తెలుసుకొని ప్రకాశంగారి గురించి ఆయన చేసిన ప్రశంస ఆనాటి మహామహులను కూడా ముక్కు మీద వేలేసుకునేట్టు చేసిందట. ‘అఖిల భారతావనికి ఆదర్శప్రాయుడైన ప్రధానివి ప్రకాశం’ అని ప్రశంసించారు. ఇది ప్రకాశం నిజాయితీకి, నిర్భయత్వానికి నిలువెత్తు ఉదాహరణ.
ఇంకో సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వారు పంపిన ఖద్దరు మిల్లుల ప్రతిపాదనను తిరస్కరించి వెనుకకు పంపించిన సాహసోపేత నిర్ణయాన్ని ఒక అధికారి గాంధీజీకి వివరిస్తూ ‘అయ్యా మీరు పండిత్ గారిని కూడా దేశవ్యాప్తంగా ఈ చర్య తీసుకోమని సలహా ఇవ్వవలసింది’ అని కోరితే గాంధీజీ ‘అమాయకుడా ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు కేసరులకే చెల్లుతుంది కానీ పండితులకు కాదు’. అది ఆంధ్రకేసరి సాహసం, నిర్భీత పరిపాలనా పటిమ. సర్వదా, సర్వత్రా ప్రజాహితమే తన మతం.
ఖాదీ కేంద్రాలలో, మిల్లు దారము నిషేధం, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మరకదుళ్ళను తిరస్కరించడం, గ్రామ స్వరాజ్య, సౌభాగ్య ఉద్యమాలు, ఫిర్కా అభ్యుదయం, ఖాదీ ఉద్యమం, ఉత్పత్తి, కొనుగోలుదారుల సహకార ఉద్యమం మొదలైనవి గాంధీని సంపూర్ణంగా బలపరచడమే కాకుండా భారతదేశమంతటా మార్గదర్శి అవుతుందని ప్రకటించారు కూడా.
చివరిగా పంతులుగారి అభిమాని, అనుచరులూ, భక్తుడూ అయిన గోపరాజు వెంకటానందం అంటారు ‘గాంధీజీ వలెనే ప్రకాశం గారు కూడా, అశక్తులను సశక్తులుగా మార్చగలిగారు. లక్షలాది భారతీయుల మానసిక దౌర్బల్యాన్ని తన గంభీరోపన్యాసాల వల్ల, కార్యాచరణ వల్ల ఇట్టే తుడిచేసి, వారిలో నవ చైతన్యాన్ని కలిగించారు. గాంధీజీ వలెనే ప్రకాశం ప్రజానాయకుడు, ప్రజాస్వామ్యవాది. తన ప్రభుత్వంలో ప్రభుత్వమే ప్రజలు - ప్రజలే ప్రభుత్వం’. అందుచేతనే ప్రజానాయకుడైన ప్రకాశానికి ప్రజల యందు అకుంఠిత విశ్వాసం.’
‘ప్రజలే నేను - నేనే ప్రజ’ అంటారు ప్రకాశం.
ప్రమాదం ఎక్కడ ఉంటే - అక్కడ ప్రకాశం’ అని నేనంటా.

-టంగుటూరి శ్రీరాం 9951417344