Others

ఆత్మాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మే ఒక బాసైనప్పుడు తన కంటి సైగే ఒక
భావమైనప్పుడు ఆమె చిరునవ్వే ఒక అందమైనప్పుడు
తన పెంపకమే ఒక జీవితమైనప్పుడు ... అన్నింటికీ
అమ్మే ఒక పోలికైనప్పుడు.. అమ్మకి వేరే పోలికలెందుకు?
కనిపించని దైవానికి వేరే రూపమెందుకు?

ఆమె గర్భాలయం నుంచి నన్ను ఈ లోకానికి తీసుకొచ్చే
పురిటి నొప్పుల ఆర్తనాదాలు ... వేద మంత్రాల్లా దీవిస్తూ
ఆహ్వానిస్తుంటే.. నేను కళ్లు తెరిచి, తన కంట సంతోషం చూడడం తప్ప
అమ్మ జీవన్మరణానికి కారణమైన నా పుట్టుకను ఎలా
ఆపగలను?

అమ్మ ప్రేమే ఆకాశమంత ఉంటే.. ఇంతని ఎలా చెప్పగలను?
ఆమె త్యాగం సాగరమంత ఉంటే .. కొంతని నా దోసిట్లో ఎలా చూపగలను?
అమ్మ కరుణ భూమంత ఉంటే నా గుప్పిట్లో ఎలా దాచగలను ?
నా అల్లరిని భరించి, తన గుండెలకు హత్తుకునే అమ్మ సహనాన్ని దేంతో పోల్చను?

నాకు అన్నం తినిపిస్తున్నప్పుడు తనకొచ్చే ఎక్కిళ్లను ఎలా ఆపగలను?
నా కడుపు నిండాక తను త్రేన్చినపుడు ఇంకోముద్ద ఎలా తినగలను?
తన దిష్టే నాకు తగిలిందని, నా చుట్టూ తిప్పే గినె్నను ఎలా విసిరికొట్టగలను?
నాకు జ్వరమొచ్చి అమ్మ ఏడుస్తుంటే.. తన కన్నీటికి
కారణమైన నన్ను నేను ఎలా శిక్షించుకోగలను?

అమ్మ తన పిల్ల కోసమే బ్రతుకుతున్నప్పుడు తన
మజిలీని ఎక్కడని వెతకాలి?
ఆమె జీవితాన్ని ధారపోశాక, బక్క చిక్కిన అమ్మ వృద్ధాశ్రమంలో
తన బిడ్డలకోసం , ఆర్తిగా ఎదురుచూస్తుంటే..
నీరింకిన ఆ మసక కళ్లను తుడిచే చెయ్యి నీ బిడ్డల దేనని
ఎలా మోసం చెయ్యగలను?

అసలు ఈ జనే్న అమ్మదే అయినప్పుడు, ఆమె రుణం
ఎలా తీర్చుకోగలను? అంబరమణి లాంటి అమ్మ గొప్పతనాన్ని మాతృదినోత్సవమంటూ
ఒక్కరోజుకే ఎలా పరిమితం చెయ్యగలను?
అమ్మకు సాష్టాంగ వందనం, అమ్మకు అక్షరాభిషేకం.. పుష్పాభిషేకం, ఆత్మాభిషేకం...

-అరుణ్, 8106863054