Others

చిట్కాలతో చింతలు దూరం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మనం తినే ఆహారంలో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పొట్టుతియ్యని ధాన్యాలు, బీన్స్, ఆకుకూరలు లాంటి వాటిని ఎక్కువగా తీసుకొంటే జీర్ణవ్యవస్థ బాగా ఉంటుంది. మలబద్ధక సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న అనారోగ్యాలు కూడా దరిచేరవు.
* మందారం పూలను రెండు గ్లాసుల నీళ్లలో వేసి మరగించి ఒక గ్లాసుకి వచ్చాక, వడకట్టి చల్లారాక సీసాలో పోసి భద్రం చేసుకోవాలి. దీన్నిజుట్టుకు రాసుకుని రెండు గంటల తరువాత తలంటు పోసుకుంటే పేను కొరుకుడు తగ్గుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
* మెంతులను నానబెట్టి వాటిని మందార ఆకులను చేర్చి రుబ్బుకొని ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఓ గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మెత్తగాను, ఒత్తుగాను అవుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
* ‘నీలకేశ తైలం’ జుట్టుకు పట్టిస్తే జుట్టును నల్లగాను, ఒత్తుగాను, పొడవుగాను అవుతుంది. తలనొప్పి, కళ్లనొప్పి, మంటలు, కళ్లు ఎర్రబారడం తదితరమైనవి రాకుండా ఉపయోగపడుతుంది.
* గుంటగలగరాకును దంచి రసం తీసి దానికి ఒక వంతు కొబ్బరి నూనె కలిపి, నీరు ఇగిరేదాకా మరిగించాలి. తరువాత వడకట్టి సీసాలో పోసుకొని ప్రతిరోజు జుట్టుకు రాసుకొంటే జుట్టు రాలడం తగ్గడమే కాక, ఒత్తుగా పెరుగుతుంది. చలువచేసి చుండ్రు తగ్గుతుంది.
* కీరదోస రసం తాగితే గుండెల్లో, కడుపులో మంట చల్లారుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు నివారించబడతాయి.
* రెండు నిమ్మకాయల రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని ఉదయంపూట తాగితే మలబద్ధకం దూరమవుతుంది. స్థూలకాయం కూడా తగ్గుతుంది.
* నూనెలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పక్షవాతం, గుండెజబ్బులు, వూబకాయం లాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
*