Others

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురుచూసి మోసపోకుమా
...
అవును మరి.. ఆ ఎవరో ఎవరు?
నువ్వే ఎందుకు కాకూడదు?
ఆ గురజాడ అంశ నీదే
ఆ కందుకూరి ప్రశంస నీదే
ఆ రాజారామమోహన్‌రాయ్ పొగడ్త నీకే
ఈ సమాజంలోని రుగ్మతలను
రూపుమాపేందుకు
జన్మించిన అపర మానవతామూర్తి వి నీవే
కదులు కదంతొక్కు పదం పాడు
ఉరకలెత్తు పరుగులు తీయ్
అధర్మాన్ని నీ ఉక్కుపాదంతో తొక్కు
అరాచకత్వం నిండిన మదాంధుల్ని
సమాజం నుండే కాక
ఈ ధరిత్రినుండే బహిష్కరించు
కొత్త భువిని ఆవిష్కరించు
అందుకో అందరి చేయూత
నీ ముందడుగు వెనుక మేమున5్నం
చరిత్రలో నీ చరిత చిరస్థాయి
ఇది ఎవరో నేర్పే కోర్సు కాదు
మనసులోనుడి మమత చేసే ఫోర్సు
హృదయం ఇచ్చే సిఫార్సు

-కోలపల్లి ఈశ్వర్ 8008057571