Others

వర్షం కురిసిన రాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుండపోతగా కురుస్తున్న వర్షంలో
తడుస్తున్న నేను, ఆలోచనలు రెండు వేరువేరు కావు
ఒకే వంతెనపై నడుస్తున్న రెండు చరిత్రలం

ఎక్కడో విస్ఫోటనం, నాలో కూడా
లోకపు వెలుగుని చూడలేని కళ్లకు
ముసుగేసి పడకేసిన సంస్కారపు వాసనలు
తెలియటం లేదు.. ఎందులకో...

చీకటిని దాటలేక అవస్థలు పడుతున్న భావమేదో
ఓ మూలగా బుడ్డి దీపం కింద అక్షరాన్ని వెలిగిస్తుంది

కొన్ని కలలని, కన్నీళ్లని, ప్రేమలని పోగేసుకొని
రెండు వాక్యాల నడుమ వొరుసుకు పోతాను

మబ్బుల గుంపు శబ్దాలు చేస్తూ
వడివడిగా నడుచుకుంటూ ఇంటి ముంగిట
చినుకులై నృత్యం చేస్తున్నప్పుడు
ఆనంద సాగరాన్ని బంధించలేని నిస్సహాయతకు
ఎవరిని నిందించను?

ఎన్ని కాలాలు నా నుంచి ప్రయాణం చేస్తే ఏమిటి
కాగితపు పడవలో సరంగులా మారుతూ
నిశ్శబ్దంలో పడి కొట్టుకుపోతున్నాను.

భావ ప్రపంచంలో ఒంటరినని ఏడుస్తూ
వాక్యం నదిలో ఈదులాడుతున్నాను
ఎప్పుడో ఒకప్పుడు
ఓ కవితాలంబన కోసం
తపన పడుతున్నాను..
వర్షం కురిసిన రాత్రి సాక్షిగా..!!

-పుష్యమీ సాగర్ 9032215609