Others

మనమే పూనుకొందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటిని, ఇంట్లో వారిని నేకాదు వీధిని, కాలనీని, అంతేకాదు అసలు ప్రపంచాన్నంతా కాలుష్యరహితం చేయాలంటే ముందుగా మహిళలే పూనుకోవాలి. వారు పూనుకొంటే చాలు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.
ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా మహిళలే ఎక్కువగా కొంటుంటారు. ఆహారానికి సంబంధించినవో లేక ఇంటి అలంకరణకు సంబంధించినవో లేక ఇంట్లో పనికి వచ్చే ఎలక్ట్రానిక్స్ ఏవో ఒకటి మహిళల ఆధ్వర్యంలోనే కొనడం సాధారణంగా జరుగుతుంటుంది.
కనుక వీరే మానవ మనుగడకే ప్రమాదం గా ఉంటున్న ఫ్యాస్టిక్‌ను దూరం చేయడానికి మొదలుపెట్టాలి.
ఉదాహరణకు కాయగూరలకు వెళ్లేటపుడు గుడ్డ సంచీని తీసుకెళ్లాలి. అక్కడ్నుంచి తెచ్చిన కూరగాయలను ఫ్యాస్టిక్ కవర్లల్లోకాక ఫ్రిజ్‌లో సర్దుకోవాలి. దానికోసం చిన్నచిన్న డబ్బాలు, అరలు ఏర్పాటు చేసుకోవాలి.
అట్లానే ఎక్కడికైనా వెళ్లేటపుడు పాలిథిన్ కవర్లు కాక కాగితపు సంచులను వాడడం అలవాటు చేసుకోవాలి. యూజ్ అండ్ త్రో వస్తువులు కాక తిరిగి వాటిని వాడేట్లు ఉండే స్టీలు , అల్యూమినియమ్ వస్తువులను ఉపయోగించుకోవాలి. ఇంట్లో ఉండే అందరిని కూడా ఫ్యాస్టిక్ వస్తువులు వాడనివ్వకుండా చేయాలి.
పిల్లలకిచ్చే టిఫిన్ బాక్స్‌లు కూడా ఫ్యాస్టిక్‌వి కాక స్టీలు బాక్స్‌లు అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి వస్తువుల గురించి జాగ్రత్తలు వారికి తెలియచెప్పాలి. ఫ్యాస్టిక్ వల్ల భూగర్భజలాలు, భూగర్భం అంతా ఎట్లా నాశనమవుతుందో వాతావరణం ఎలాంటి ప్రమాద సూచికలు తెలియచేస్తోందో దానికి కారణమేమిటో పిల్లలకు చెబుతుండాలి. దానివల్ల వచ్చే తరంలో పాలిథిన్ కవర్లు వాడకం అనేమాట వారు అసలు ఉపయోగించని స్థితిలోకి మారుతారు. పిల్లలు యూజ్ అండ్ త్రో వస్తువులు కాక తిరిగి వాడగలిగిన వస్తువులు వాడితే వారికి మంచి బహుమానాలు ఇస్తామని వారి మనసును దోచి వారి ప్రమాదాన్ని వాటిల్లచేసే వస్తువుల వాడకం నుంచి దూరం చేయాలి.
మహిళలే పూనుకొని ఫ్లాస్టిక్ వస్తువుల జోలిని దూరం చేయాలి. పాలు, కూరగాయలు, బ్రెడ్ లాంటివాటిని కూడా దుకాణాదారుల నుంచి ఫ్యాస్టిక్ సంచుల్లో ఇస్తే తీసుకోమని ఖరాఖండిగా చెప్పాలి. వారాంతపు రోజుల్లో చేసే పిక్‌నిక్‌ల్లో కూడా ఫ్యాస్టిక్ సంచుల వాడకం ఎక్కువగా ఉంటుంది. దానిని కూడా మహిళలే దూరం చేయాలి. ఇలా పర్యావరణానికి హాని చేసే వస్తువులను దూరం చేయడానికి కేవలం మహిళలే కాదు పిల్లలు పెద్దలు అందరూ ఇంటిల్లిపాది సహకరిస్తే కొన్నాళ్లల్లోనే ఈ ఫ్యాస్టిక్ అనే వ్యర్థాలు తొలగించి కాలుష్యరహితమైన వాతావరణాన్ని తెచ్చుకోవచ్చు.