Others

అనుకొన్నా నీవు వస్తావనీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం అల్లుకున్న జ్ఞాపకాల పందిరి
నీవు నేను కలబోసుకున్న అనుభవాల సందడి
నీవు నన్ను వీడినా ఈ
జ్ఞాపకాల సుందరి
నన్ను వీడదని నీవు నాడు అన్నదే నిజం చేస్తున్నావు ప్రియా
ఈ పందిరి కింద మనం పారేసుకున్న కాలం
కన్నీళ్ల పుష్పాలు, నిట్టూర్పుల నెగళ్లను
ఎన్ని దోసెళ్లను నింపిందో
ఈ పందిరి కింద నీవు నేను ఒక్కటైనపుడు
వెలుగు పూలు నలిగిపోతున్నా
చీకటి రాజ్యానికి దారులు తీస్తున్నా
మిణుగురు వెలుతుర్లో అడుగు ముందుకే వేశావు నీవు
నీ అడుగులో అడుగేసి నీకు తోడుగా నీడగా నేనుంటానన్నాను
నీ చిరునవ్వే నన్నీ
మళ్లీ నన్నీ జ్ఞాపకాల
పందిరి కింద చేర్చింది
నీవు వస్తావని అనుభవాల సందడి చెప్తునే ఉంది
ఇందాకే ఆశల కిరణమొకటి
జ్ఞాపకాల పందిరిని చీల్చుకుని వస్తుంటే
అనుకొన్నా నీవు వస్తావని
నన్ను అలరిస్తావని...

-చరణశ్రీ