Others

‘అపురూపమైనదమ్మ ఆడజన్మ.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడజన్మ గొప్పదనం గురించి- విశిష్టంగా వివరించి రచించిన ఈ గీతం- సిరివెనె్నలగారి సాహితీ సృష్టికి మరో మచ్చుతునక. 1996 సం.లో విడుదలై విజయవంతమైన చక్కని కుటుంబ కథాచిత్రం- ‘పవిత్ర బంధం’ (వెంకటేష్- సౌందర్యల)లోని ఈ పాటకు చక్కని సంగీతాన్ని సమకూర్చారు యం.యం.కీరవాణిగారు- అంతే భావగర్భితంగా రాగాలాపన చేశారు గాయకులు యేసుదాసుగారు- ఇలా ఏ కోణంలో చూసినా సన్నివేశపరంగా చక్కగా కుదిరిన ఈ పాట- మగవారికి ఆడదాని విలువను సవివరంగా చెప్పిన సందేశాత్మక గీతం పాట ‘కార్యేషు దాసి...’ అనే సాకీతో ఆరంభమైనా పల్లవిలోనో- ఆడజన్మకు పరిపూర్ణత ఇల్లాలని- ‘మగవాని బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా-’ ఆడజన్మ సార్థకతను చాటిచెప్పింది! లలిత గీతాల రచనలో తనదైన శైలిని ప్రతిబింబిస్తూ- సిరివెనె్నలగారు- పాట రెండవ చరణంలో- ‘కలిమి లేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా- సహ ధర్మచారిణి- సరిలేని వరమని’అనే పద ప్రయోగాలలో తనకుతనే సాటి అనిపించుకున్నారు. సహజమైన హావభావ ప్రకటనలతో తెరపై వెంకటేష్- కీ.శే.సౌందర్యలు నాయకీ-నాయకులుగా ఓ నిజజీవితాన్ని ఆవిష్కరించారు! అందుకే ఈ పాట ఎప్పుడు విన్నా నన్ను నేను మైమరచిపోతాను. పూవు తావి వంటి పవిత్రబంధం-ఆలు-మగలదని ఋజువుచేసిన ఈ గీతం మరువలేను నేను జీవితాంతం!

- మరువాడ భానుమూర్తి, వనస్థలిపురం, హైదరాబాద్