AADIVAVRAM - Others

ఈ క్రీడలు పుట్టింది ఇక్కడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అయిదు క్రీడలకు మూలాలు భారత్‌లోనే అంటే ఒకింత ఆశ్చర్యం కలగొచ్చు.. కానీ, ఇది ముమ్మాటికీ నిజం. మన నాగరికతలో చదరంగం, పోలో, కబడ్డీ, బ్యాడ్మింటన్, క్యారమ్ క్రీడలకు చారిత్రక ఆధారాలున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆధునిక కాలంలో రమేష్‌బాబు ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్ వంటి మేటి క్రీడాకారులు చదరంగంలో భారత కీర్తిపతాకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించారు. కబడ్డీలో భారత్‌కు ఎదురే లేదని మన క్రీడాకారులు ఇప్పటికే పలు అంతర్జాతీయ పోటీల్లో నిరూపించారు. బ్యాడ్మింటన్‌లో ప్రకాష్ పదుకొనె, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, అపర్ణ పొపట్ వంటి క్రీడాకారులు మన దేశానికి వనె్న తెచ్చారు.
చదరంగం..
దాదాపు 1,500 ఏళ్ల క్రితమే చదరంగం మన దేశంలో మేధోపరమైన క్రీడగా ప్రఖ్యాతి చెందింది. రాజుల కాలంలో ‘చతురంగ బలాల’ను నడిపించడం ‘చదరంగం’ క్రీడకు నిదర్శనమని చరిత్రకారులు విశే్లషిస్తున్నారు. హరప్పా, మొహెంజాదారో నాగరికతలో చదరంగం క్రీడ ఆనవాళ్లు ఉన్నట్టు కనుగొన్నారు. ఈ క్రీడను సంస్కృతంలో ‘అష్టపద’గా పిలిచేవారు. అలనాడు మన దేశంలో పర్యటించిన పర్షియా, అరబిక్ సందర్శకులు ‘చదరంగం బోర్డు’ను గమనించి తమ తమ దేశాల్లో ఈ క్రీడకు ప్రాచుర్యం కల్పించారు.
పోలో..
గుర్రాలపై కూర్చుని రెండు బృందాలు పరస్పరం పోటీ పడుతూ చెక్కబంతితో ఆడే ‘పోలో’ క్రీడ కొన్ని దశాబ్దాల క్రితమే మన దేశంలో ప్రాచుర్యం పొందింది. మణిపూర్‌లో దీని మూలాలను చరిత్రకారులు కనుగొన్నారు. 1859లో ‘సిల్చార్ పోలో క్లబ్’ ఆవిర్భవించింది. బ్రిటిష్ మిలటరీ అధికారులు ఈ క్రీడను విస్తృతంగా ఆడేవారు. భారత్ నుంచి ‘పోలో’ 1868లో మాల్టాకు, 1869లో ఇంగ్లండ్‌కు, 1870లో ఐర్లాండ్‌కు, 1872లో అర్జెంటీనాకు, 1874లో ఆస్ట్రేలియాకు విస్తరించింది. ఇప్పుడు ఇది అంతర్జాతీయ క్రీడగా వృద్ధి చెందింది.
కబడ్డీ..
1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో పరిచయమైన కబడ్డీ అనాదిగా భారత్‌లో విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. పంజాబ్‌లో ఇది యుద్ధక్రీడల సంప్రదాయంగా విస్తరించింది. బంగ్లాదేశ్‌లో జాతీయ క్రీడగా గుర్తింపు పొందిన కబడ్డీ తెలంగాణ, కేరళ,కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ల్లో ‘రాష్ట్ర క్రీడ’గా రాణిస్తోంది. 1950లో ‘అఖిల భారత కబడ్డీ సమాఖ్య’ ఆవిర్భావంతో ఈ ఆటకు పటిష్టమైన నిబంధనలు రూపొందించారు. 1979లో జపాన్‌లో ప్రవేశించాక ఈ క్రీడ విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందింది.
బ్యాడ్మింటన్..
బ్రిటిష్ పాలనలో పూణెలో ఈ క్రీడకు బలమైన పునాదులు పడ్డాయి. బ్యాడ్మింటన్‌కు సంబంధించి 1873లో పూణెలో నియమ నిబంధనలు రూపుదిద్దుకున్నాయి. అనతికాలంలో ఇంగ్లాండ్, స్కాట్‌ల్యాండ్, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఇది వ్యాపించింది. మహారాష్టల్రో ఆవిర్భవించిన ఈ క్రీడ నేడు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతో ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఎనె్నన్నో పోటీలు జరుగుతున్నాయి.
క్యారమ్..
దక్షిణ ఆసియా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ ఆటకు మూలాలు భారత్‌లోనే అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇళ్లలో చిన్నా పెద్దా అనే వయోభేదం లేకుండా కుటుంబ సభ్యులంతా కలసి ఆడుకునే ‘క్యారమ్’ ఆట విభిన్నమైనది. పాటియాలా (పంజాబ్)లోని రాచకుటుంబాల్లోని వారు తీరిక సమయాల్లో దీన్ని ఆడేవారు. 19వ శతాబ్ది నాటికి ఇది మన దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తరించింది. 1958 నాటికే వివిధ స్థాయిల్లో క్యారమ్ క్లబ్‌లు, సమాఖ్యలు ఏర్పడడంతో ఇది భారత్ నుంచి మిగతా దేశాలకు వ్యాపించింది. నేటి నవ నాగరిక యుగంలో ఆటంటే ‘క్రికెట్’ మాత్రమేనన్న భావన బలపడినప్పటికీ, సంప్రదాయాలకు నిలయమైన భారత్‌లో ఎన్నో క్రీడలు రూపుదిద్దుకుని విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందాయి.