Others

బాలీవుడ్‌లోకి సుకుమార్?( టాలీటాక్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం పరిస్థితుల్లో మూడురోజులు సినిమాలు ఆడడమే గగనం అవుతున్న ఈరోజుల్లో ఏకంగా 15 సెంటర్స్‌లో వంద రోజుల సినిమా ఇచ్చాడు సుకుమార్. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం అటు వంద రోజులు పూర్తిచేసుకోవడంతోపాటు నాన్ బాహుబలి రికార్డులో టాప్ సినిమాగా నిలిచింది. దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా రామ్‌చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత సుకుమార్ మహేష్‌తో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సినిమా రెండో షెడ్యూల్ అమెరికాలో జరపనున్నారు. అయితే ఈ సినిమా పూర్తయ్యేవరకు చాలా టైం పట్టేలా ఉండడంతో ఈమధ్యలో మరో సినిమా చేయాలనీ ప్లాన్‌చేస్తున్నాడు సుకుమార్. అయితే ఈసారి ఆయన చేసేది హిందీలో? అవును.. ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ సినిమాకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే జుద్వా 2 సినిమాలో నటించి ఆకట్టుకున్న వరుణ్‌ధావన్‌తో ఉంటుందట. ఓ క్యూట్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ఇప్పటికే సుకుమార్ ముంబై వెళ్లి ఈ సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నాడని తెలిసింది. క్యూట్ లవ్ స్టోరీలను డీల్ చేయడంలో సుకుమార్ స్టైల్ వేరుకాబట్టి.. వరుణ్ ధావన్ లాంటి యంగ్ హీరోతో సినిమా చేస్తున్నాడంటే నిజంగా అది ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సో త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.