Others

ఇంటి అలంకరణ ఇలా ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్‌మెంట్స్ చిన్న చిన్న గదులు.. సామాన్లు గది అంతా పరుచుకున్నట్టు ఉంటూ అసలే చిన్న గదిని మరింత ఇరుకుగా ఉన్నట్టు చేస్తుంటాయి. అట్లాకాక చిన్న గదులే పెద్దవిగా కనిపించాలన్నా లేదా విశాలంగా ఉన్నట్టు అనిపించాలంటే చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించాలి. ముందుగా గది గోడలకు వేసే రంగుల పైన దృష్టిని నిలపాలి. ఏ గదిని ఎందుకు వాడుతామో ముందుగా నిర్ణయించుకుంటే దాన్ని బట్టి కలర్ ను ఎంపిక చేసుకోవాలి. ముదురు రంగులు వేసినా వాటికి మంచి కిటికీల రంగు, కర్టన్స్‌కు మంచిరంగు వేస్తే చిన్నగదికి మంచి లుక్ వస్తుంది. సీలింగ్ కు ఎప్పుడూ తెల్లరంగువేసుకుంటే ఎంతో ఎత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మూడు గోడలకు ఒకేరంగు నాలుగో గోడకు ఇంకో రంగు వేస్తున్నారు. ఈ కలర్స్‌కూడా మంచి షేడ్స్ తో వేసుకొంటే గది అందాన్ని పెంచుతాయి.
బెడ్‌రూమ్‌కోసం వామ్‌కలర్స్, బాత్‌రూమ్‌లో కూల్ షేడ్స్ వేసుకోవాలి. ఫర్నిచర్ రంగులకు దగ్గరగా ఉన్న రంగులను గోడలకు వేసుకున్నా బాగుంటుంది. ఉడ్‌వర్క్ చేయించుకునేటపుడు మాత్రం గోడ రంగు కంటే ముదురు రంగు షేడ్ ఉండేలా చూడాలి. గదికి తగ్గ ఫర్నిచర్‌నే వాడాలి. కాని పెద్దదిగా ఉందనో, చూడడానికి బాగుందనో వాడకూడదు. మరీ చిన్నదిగాను ఉండకూడదు. ఆ ఫర్నిచర్ మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా చూసుకోవాలి. పుస్తకాలు, బొమ్మలకు సరిపడా ఉంటే అలమర్లను లివింగ్ రూమ్‌లో పెట్టుకోవాలి. గది మూలల్లో మంచి సువాసనిచ్చే పూలను అమర్చుకోవాలి. మంచాలు, దివానా సెట్టు , సోఫాలు, కుర్చీలు అమరిక లో విభిన్నంగా కనిపించేట్టు ఉండాలి. సోఫా, కుర్చీల మధ్యలో మంచి కళాఖండాన్ని అమర్చుకోవాలి.. బెడ్‌లైట్‌ను కూడా మంచి రంగులోను చూడగానే అందంగా కనిపించేట్టు డెకరేటివ్ పీసులాగా ఉండేట్టు చూసుకోవాలి. వంటింట్లో కూడా అవసరమైన వస్తువులను మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడో ఒకసారి పనికి వచ్చే సామాను అంతా అటకపైన చేర్చుకోవాలి.ఫ్రిజ్‌లో కూరగాయలు, పండ్లు, పాలు లాంటి వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. గదులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంటే కూడా అందంగా విశాలంగా కనిపిస్తాయి.

- శ్రీలత