Others

స్పేస్‌లో బాలీవుడ్ బాద్షా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బాద్షాకు ఈమధ్య కెరీర్‌పరంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు చేస్తున్న సినిమాలన్నీ కమర్షియల్‌గా సక్సెస్ కావడంలేదు. దాంతో క్రేజ్ కూడా బాగా తగ్గింది. ప్రస్తుతం జీరో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరుగుజ్జు పాత్రలో షారుఖ్ కనిపిస్తాడట. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఆయన స్పేస్ పైలెట్ రాకేష్‌శర్మ బయోపిక్‌లో నటిస్తున్నాడు. మహేష్ మత్తయి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించే ఈ సినిమా సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. భారత తొలి ఆస్ట్రోనాట్ రాకేష్‌శర్మ పాత్ర కాబట్టి.. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా స్పేస్ సెట్టింగ్ వేస్తున్నారు. ఆ సెట్స్‌లోనే రెండు నెలలపాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుతారట. సెల్యూట్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల చేస్తారట. మరి బాలీవుడ్ బాద్షాని ఈ సినిమా అయినా గట్టెక్కిస్తుందేమో చూడాలి.