AADIVAVRAM - Others

అపర భగీరథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో మేధావులకు కొదవలేదు. ఎక్కువ మంది అట్టడుగు స్థాయినుంచే వచ్చినవారున్నారు. చిన్నతనం బాధలు, గొప్పవారవ్వాలనే లక్ష్యంతో కష్టాలుకోర్చి ఉన్నతత్వాన్ని సాధించారు. అలాంటి కోవలోకి చెందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన, దేశం గర్వించదగ్గ ఇంజనీర్లలో ఒకరు ఆధునిక కాలపు అపర భగీరథుడు అనిపించుకున్న ఘనుడు కె.ఎల్.రావు. (కానూరి లక్ష్మణరావు). 1902 జూలై 15న విజయవాడ సమీపంలో ‘కంకిపాడు’లో జన్మించారు. అతను 9 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోవటం, అన్నగారి పోషణలో పెరగటం తమ్ముడ్ని ఇంజనీరుగా చేయాలన్న సంకల్పం, మేథమేటిక్స్, ఆనర్స్, మెడిసిన్ సీట్లు లభించిన, వాటిని వదిలి మద్రాసులో గిండి ఇంజనీరింగ్ కాలేజిలో చేరారు. దైవభక్తి కలిగి, భగవద్గీత, ఖురాన్, రామకృష్ణ పరమహంస, వివేకానంద వారి రచనలతో ప్రభావితుడై, మహాత్మాగాంధీగారి స్ఫూర్తితో నిరాడంబరుడుగా, వ్యసనాలకు దూరంగా ఉంటూ ‘ఖాదీ ఇంజనీర్’గా పిలవబడ్డాడు. తన వృత్తియందు గౌరవం, దేశహితకారిగా ఆలోచించేవారు.

ఎదుగుదల, ఉన్నత పదవులు
మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత పీడబ్ల్యుడీ వర్క్‌షాప్‌లో ఒక సంవత్సరం శిక్షణ పొంది, విశాఖలోని డిస్ట్రిక్ట్ బోర్డులో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరారు. బర్మా వెళ్లాలని ప్రయత్నం విఫలమవటంతో, విజయనగరంలో అసిస్టెంటు ఇంజనీరు ఉద్యోగం చేశారు. తర్వాత ఇంగ్లండు వెళ్లి అప్రెంటిస్‌గా పనిచేస్తూ పరిశోధనలు చేశారు. అక్కడ అవకాశాలు ఉన్న, భారతదేశపు నిర్మాణ రంగ సవాళ్ళను ఆకర్షణీయంగా స్వీకరించి స్వదేశం తిరిగి వచ్చారు. కె.ఎల్.రావుగారిని కేంద్రం జల విద్యుత్ కమిషన్ డిజైన్సు విభాగానికి డైరెక్టరుగా నియమించారు 1950లో. 1954లో వరదలు అరికట్టే విభాగానికి చీఫ్ ఇంజనీరు అయ్యారు. 1956లో కేంద్ర జల విద్యుత్ కమిషన్ సభ్యుడయ్యారు. ఐక్యరాజ్యసమితి సహజ వనరుల కమిటీ అధ్యక్షులుగా, అంతర్జాతీయ నీటి పారుదల సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 1957లో ఉద్యోగ పదవీ విరమణ చేసినా 1962వరకు కేంద్ర జల కమిషన్ సభ్యులుగా కొనసాగారు. వరదల నివారణ, నదీ లోయలపై నిర్మాణాలు, రీయిన్‌ఫోర్సుడ్ సిమ్మెంట్, కాంక్రీటు వంటి విషయాలపై నిరంతర అధ్యయనం అతని వ్యాపకం.
ప్రజల మనిషిగా పేరొందిన కె.ఎల్.రావును వారి సేవల్ని దేశానికి ఉపయోగించుకోవాలని, 1962లో నీలం సంజీవరెడ్డి కోరిక మేరకు విజయవాడనుంచి లోక్‌సభకు పోటీ చేశారు. 1967, 1971 ఎన్నికల్లో గెలిచిన వీరు విజయవాడ స్థానానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు. నెహ్రూ, శాస్ర్తీ, ఇందిరాగాంధీ మంత్రి వర్గాలలో వీరు బాధ్యతలు వహించి, దేశంలో ఎన్నో వ్యవసాయ, జల విద్యుత్ ప్రాజెక్టులకు జీవంపోశారు. భారతదేశ భవిష్యత్ కాలానికి సంబంధించిన గొప్ప సూచనలు చేశారు. వాటిని రూపుదాల్చడానికి ఎంత సమయం పడుతుందో ‘గంగా-కావేరి’ నదుల అనుసంధానం వరదలు వచ్చి ముంపునకు గురయినపుడు, నీరులేని నదులు చూసినపుడు పాలకులకు వీరి ప్రణాళికే గుర్తొస్తుంది. కాని ఆచరణ, ఆర్థిక అంశాలు అంత సులువుకాదు అంటారు. వారు ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్’కు అధ్యక్షునిగా కొన్నాళ్లు సేవలందించారు. భారత ప్రభుత్వం వారిని 1963లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆ అపర భగీరథుడు, నిరంతర అధ్యయనవేత్త, దేశోపకార కర్తయిన శ్రీ కె.ఎల్.రావుగారు 1968 మే 18న మరణించారు.
------------------------------------------------------------------

జూలై 15 డా. కె.ఎల్.రావు జయంతి.....

- లోకనాధం సత్యానందం