Others

విపత్తుల వేళ జనగళం విన్పించిన నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుఫాన్ సంభవించిన వెంటనే కేంద్ర ప్రభుత్వ తక్షణ సహాయం విషయమై వివరాలను తెలిపే సందేశం టెలిప్రింటర్‌లో వచ్చింది. (ఆ కాలం లో ఫ్యాక్స్‌లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలవలేదు). అందులో ‘కేంద్ర సహాయం ఇంత..’ అన్న సమాచారాన్ని సీఎం చెన్నారెడ్డి దృష్టికి తెచ్చినప్పుడు, ఆ అంకె తప్పని వెంటనే స్పందించారు. మాకు అర్థం కాలేదు. మరో మెసేజ్‌లో ముఖ్యమంత్రి చెప్పిన రూ. 86 కోట్ల మొత్తం గురించి సవరణ వచ్చింది. అదీ ఆయన జ్ఞాపకశక్తి. ఆ సహాయం గురించి ఆయనే మాకు స్వయంగా వివరించా రు. రకరకాల అంశాలను అధ్యయనం చేసి ఆర్థిక కమిషన్ ‘ఇంత మొత్తం’ అంటూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన రాష్ట్రానికి తక్షణ సహాయం కింద ఇవ్వాలని నిర్ణయిస్తుందని, ఆ మొత్తం అప్పట్లో రూ. 86 కోట్లుగా మాకు విశదీకరించారు. అందులో కూడా మూడొంతులు కేం ద్రం, ఒక వంతు రాష్ట్రం భరిస్తుందని సీఎం చెప్పారు. ఆ తుఫాన్‌ను ‘జాతీయ విపత్తు’గా పరిగణించాలని చెన్నారెడ్డి చేసిన ప్రతిపాదనకు స్పందించిన అప్పటి ప్రధాని వీపీ సింగ్ ‘ఇది జాతీయ విపత్తు కాకపోతే మరింకేదీ జాతీయ విపత్తుగా అనలేం’-అని వ్యాఖ్యానించడమంటే, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం అనుకోవాలి. అంతటితో ఆగకుండా ఇక్కడ వున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని అనుకోకుండా, ఒక ప్రత్యేక అధ్యయన బృందాన్ని కూడా రాష్ట్రానికి వీపీ సింగ్ పంపించారు.
అయినా చెన్నారెడ్డి ఏ మాత్రం తృప్తిపడలేదు. అందిన సహాయం ఏ మూలకూ సరిపోదని ఆయన భావన. ఆ ఆలోచనతో ‘ప్రపంచ బ్యాంక్’ను కదిపారు. ‘ఈ ఆధునిక ప్రపంచంలో కొంత బియ్యాన్ని పంచడంతోనో, మరో రకమైన ధాన్యాన్ని- పప్పు దినుసులను సమకూర్చడంతోనో, గుడిసెల మరమ్మతులకు ఎంతోకొంత ధనం సహాయం చేయడంతోనో సరిపుచ్చుకోవడం మన సంస్కృతిని- సాంప్రదాయాన్ని - ప్రపంచం దృష్టిలో మన గౌరవప్రతిష్ఠలను ప్రతిబింబించవు. శాశ్వతమైన ఏర్పాట్లు చేసినప్పుడే ఫలితం వుంటుంది’ అన్నారాయన. ఏం జరిగిందో, ఎలా జరిగిందో అని అర్థం చేసుకునే లోపల, ప్రపంచ బ్యాంక్ బృందం తుఫాన్ సంభవించిన తర్వాత కొద్దిరోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించింది. ముఖ్యమంత్రిని కలిశాక, అధికారులు వెంటరాగా రెండురోజులు పర్యటించింది ఆ బృందం. మళ్లీ ఆ బృందం తనను కలిసినప్పుడు ముఖ్యమంత్రి వారికిచ్చిన ‘తుఫాన్ ప్రాంత సంగ్రహ సమాచారం’ (Detailed Brief on what is to be done?) వివరించిన తీరు ఆయన మేధస్సుకు నిదర్శనం. బహుశా ఆయన తప్ప మరొకరు ఆ విధంగా చేయలేరని నా ఉద్దేశం. ఆయన ఆరోజు ప్రపంచ బ్యాంక్ బృందానికి చేసిన సూచన భావితరాల వారికి శాశ్వత పరిష్కారం. ఆ తర్వాతి ప్రభుత్వాలు నిజంగా అందులో ఎన్ని అమలుచేసాయోగాని, ఆచరణలో జరిగి ఉంటే తుఫాన్ తాకిడికి జరిగే నష్టం చాలావరకు నివారించగలిగే వీలుండేది. ఆ యన ఇచ్చిన వివరణలో ప్రధానమైంది- ‘కృష్ణా-గోదావరి డెల్టా ప్రాంతంలో పురాతన కాలంలో నిర్మించి అస్తవ్యస్తమైన డ్రైనేజి ఏర్పాటు’ గురించి.
‘యావత్ భారతదేశంలో ఆంధ్ర ప్రాంత రైతులు వ్యవసాయోత్పత్తిలో అగ్రగణ్యులని 1924లో అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసిన ‘రాయల్ అగికల్చరల్ కమిషన్’ పేర్కొంది. దానికి ప్రధాన కారణం అక్కడి డెల్టా ప్రాంతం- డ్రైనేజి వ్యవస్థ. అందుకే భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్‌కు పేరొచ్చింది. దురదృష్టవశాత్తూ తుఫాన్ మూలంగా డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. అలా పాడైపోవడానికి రాజకీయ నాయకుల, భూఆక్రమణదారుల ప్రోత్సాహంతో డ్రైనేజి ప్రాంతంలో కాలువలకు చెందిన కొంతభాగాన్ని కబ్జా చేయడమే కారణం. కొందరు దురాశాపరుల మూలాన మొత్తం డ్రైనేజి వ్యవస్థ పగుళ్లకు దారితీసింది, పనికిరాకుండా పోయింది. ఆంధ్ర ప్రాంతంలో సుమారు వేయి కిలోమీటర్లకు పైగా పొడవనున్న తీరప్రాంతంలోని చాలాభాగం తుఫాను తాకిళ్లకు గురయ్యే ప్రమాదముంది. ఈ ప్రమాదం నుంచి శాశ్వతంగా అక్కడి ప్రజలను కాపాడాలి’ అని ప్రపంచ బ్యాంక్ బృందానికి వివరించి, ‘తుఫాన్ ఆవాసాలను’ ఆ ప్రాంతాలలో పటిష్టంగా నిర్మించేందుకు ఆర్థిక సహాయం చేయమని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఆ విషయం గురించి ప్రపంచ బ్యాంక్ ఉపాధ్యక్షుడు మొయిన్ కురేషీతో చర్చించాలని చెన్నారెడ్డికి సూచించారు బృందంలోని సభ్యులు.
అప్పట్లో ప్రపంచ బ్యాంక్ సహాయం పొందాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఇప్పుడూ అవసరమే కాని కేంద్రం దృష్టికి తీసుకెళ్తే చాలు. చెన్నారెడ్డి ఢిల్లీవెళ్లి ప్రధానిని, ఆర్థికమంత్రిని కలిసి డ్రైనేజి వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ సహాయం ఆశిస్తున్నట్లు చెప్పి, వారిచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. తుఫాన్ కారణంగా మొదట్లో వాయిదా వేసుకున్న తన అమెరికా ప్రయాణాన్ని వారం, పదిరోజుల అనంతరం చెన్నారెడ్డి కొనసాగించారు. అత్యవసరంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సినప్పటికీ జూన్ 6, 1990 అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరేంతవరకు, నిత్యం ప్రపంచ బ్యాంక్ ఉపాధ్యక్షుడితో సంప్రదింపులు జరుపుతూనే వున్నారు. డ్రైనేజి వ్యవస్థ పునరుద్ధరణ తన ప్రథమ కర్తవ్యంగా భావించానని అమెరికా నుంచి వచ్చిన చెన్నారెడ్డి సిరిఫోర్టు ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో చెప్పారు. చెన్నారెడ్డి ఒకప్పుడు రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక మంత్రిత్వశాఖలను నిర్వహించిన సందర్భంలో మొయిన్ కురేషీని కలిసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. డ్రైనేజి పునరుద్ధరణకు సంబంధించిన అంచనాలను తయారుచేయాలని, అలా చేయించిన తదుపరి తప్పక ఆర్థిక సహాయం చేస్తామని ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడి దగ్గర హామీ తీసుకున్నారు చెన్నారెడ్డి. ఆ ఇరువురి కలయిక తర్వాత కేవలం పధ్నాలుగు రోజుల్లో నిష్ణాతులైన పలువురు నిపుణులున్న ప్రపంచ బ్యాంక్ బృందం రాష్ట్రానికి రావడం, సవివరంగా అంచనాలను రూపొందించడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ హామీ నెరవేరడం వల్లనే పాడైపోయిన డ్రైనేజి వ్యవస్థ బాగుపడింది ఆ తర్వాత.
చెన్నారెడ్డి వద్ద పౌర సంబంధాల అధికారిగా ఆ సమయంలో పనిచేసిన నాకు పలు విషయాలను చాలాదగ్గరగా గమనించే అవకాశం కలగడమే కాకుండా, ఎన్నటికీ మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆ జ్ఞాపకాలలో కనీసం కొన్నైనా, నేనే కాకుండా వాటిని దగ్గరగా వీక్షించిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ జేసీ దివాకరరెడ్డి, సమరసింహారెడ్డి.. పలువురు పాత్రికేయులకు, వర్తమాన రాజకీయాలను గమనించే చాలామందికి అలనాటి సంగతులు గుర్తుండే వుంటాయి.
ఆరోగ్యం బాగాలేనందున శస్తచ్రికిత్స కోసం అమెరికా ప్రయాణానికి సిద్ధమై, తర్వాత ఆరోగ్యం విషయం పక్కనపెట్టి, తన పర్యటననే వాయిదా వేసుకొన్న అరుదైన నేత చెన్నారెడ్డి. అమెరికా వెళ్లినా, అక్కడ కూడా తన ఆరోగ్యం కంటే- తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు శాశ్వత పునరావాస చర్యలు చేపట్టేందుకు ప్రపంచ బ్యాంక్ సహకారం కోరడానికి సంబంధిత అధికారులను కలుసుకోవడంలోనే వారం, పది రోజులు ఆయన గడిపారు. ఆ తర్వాతే వైద్య చికిత్సకు సిద్ధమయ్యారు. అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన చెన్నారెడ్డి న్యూ ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో అలనాటి రాష్టప్రతి ఆర్.వెంకట్రామన్ సమక్షంలో ప్రసంగించారు. ‘జాతీయ విపత్తుల సమష్టి సంస్థ’(National Calamities Corpus- Need for the Hour) ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గురించి ప్రస్తావన చేశారు.
తుఫాన్ బీభత్సాలను, ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిపోదని బహిరంగంగా చెన్నారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఫైనాన్స్ కమిషన్ సమీక్షల ఆధారంగా అయిదు సంవత్సరాల కాలపరిమితికి సరిపడా ‘ప్రకృతి వైపరీత్యాల సహాయ విధానం’ సరిపోదన్నారు. ఒకటి, రెండు రాష్టల్ర నుంచో, కేంద్రం నుంచో నిధులను సేకరించి ‘జాతీయ విపత్తుల సహాయక నిధి’ని ఏర్పాటు చేయడంతో సరిపోదని, అన్ని రాష్ట్రాల్లోని పౌరులందరి విరాళాలతో, భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక ‘న్యూక్లియస్ నిధి’ని ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ విపత్తులలో, విషాదాల్లో తమవంతు పాత్ర నిర్వహించాలన్న భావన ప్రతి పౌరుడిలో కలిగించాల్సిన సమయం ఆసన్నమైందని స్ప ష్టం చేశారు చెన్నారెడ్డి. ప్రణాళికా సంఘం సరైన ఆలోచన చేసి, ప్రతి రాష్ట్రాన్ని- ప్రతి పౌరుడిని విధిగా తోచినంత విరాళం ఇచ్చే విధంగా ‘శాశ్వత నిధిని’ ఏర్పాటుచేసి, ఆ నిధులతో నడిచే ‘జాతీయ విపత్తుల సమష్టి సంస్థ’ను నెలకొల్పాలని సూచించారు. అలాచేస్తే ప్రకృతి వైపరీత్యాల్లో తమ విరాళాలతో, తమ తోటివారికి సహాయం అందిందన్న సంతృప్తి ప్రతి పౌరుడిలో కలుగుతుందని ఆయన భావించారు. అలా జరిగుంటే బాగుండేదేమో!
‘జాతీయ విపత్తుల సహాయక నిధి’ పేరుతో ఒకటి, ‘జాతీయ విపత్తుల ఆకస్మిక ఖర్చుల నిధి’ పేరుతో మరొకటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, చెన్నారెడ్డి సూచించినదానికి, వీటికి చాలా తేడా వుంది. తుఫాన్‌కు గురైన రాష్ట్రాలకు ఈ రెండు సంస్థల నుంచి నిధులను విడుదల చేసే విధానాన్ని ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ ఆ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది. సిరిఫోర్టు ఆడిటోరియంలో ప్రసంగించిన చెన్నారెడ్డి తన ఉపన్యాసంలో అవన్నీ వివరించిన సందర్భంగా అధికారులను అభినందించిన తీరు ఆయన పాలనా దక్షతకు మచ్చుతునక.
(సమాప్తం)
*
(డా. మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాల సందర్భంగా)
*
-వనం జ్వాలా నరసింహారావు (మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)