Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్ క్షేపణా పక్షేపణా కుంచన ప్రసారణ గమనాని పంచ కర్మాణి
పైకి ఎగురుట, క్రిందకు పడుట, ముడుచుకుపోవుట, చాచుట, కదలుట- అనే అయిదు రకాల లక్షణాలు ప్రతి పదార్థానికీ ఉన్నాయని దీనిలో స్పష్టంగా చెప్పబడింది.
అలాగే పదార్థాలకు స్థితిస్థాపకశక్తి వున్నట్లుగా క్రీ.శ.991 నాటి శ్రీ్ధరాచార్య విరచిత న్యాయకందళీ అనే గ్రంథంలో పేర్కొనబడింది.
యే ఘనా నిబిడావయవసన్నివేశాః తైః
విశిష్టేషు స్పర్శవత్సు ద్రవ్యేషు వర్తమానః
స్థితిస్థాపకః స్వాశ్రయమన్యథా
యథాకథమవనామితం యథావత్ స్థాపయతి
పూర్వవదృజుం కరోతి
సాంద్రంగా గట్టిగా వుండే అవయవ సన్నివేశంగల, స్పర్శకు తెలిసే, ద్రవ్యాలలో స్థితిస్థాపకము అనే శక్తి వుంటుంది. ఆ శక్తి తనకు ఆశ్రయమైన పదార్థాన్ని బైటిశక్తులేవైనా విరూపంగా చేసినా, మళ్లీ దాన్ని పూర్వస్థితికి సూటిగా తీసుకువస్తుంది.
అలాగే క్రీ.శ.12వ శతాబ్దినాటి రసార్ణవం అనే గ్రంథంలో అయస్కాంతాల వివరాలు ఉన్నాయి.
అయస్కాంతాలలో అయిదు రకాలున్నాయి. 1.భ్రామకం 2.చుంబకం 3.కర్షకం 4.ద్రావకం 5.రోమకాంతం- అని.
ఏకముఖీ, ద్విముఖి, త్రిముఖీ, చతుర్ముఖీ, పంచముఖీ, బహుముఖీ అని కూడా వాటిలో రకాలున్నాయి.
అందులో మళ్లీ ఒక్కొక్కటి పసుపు, ఎరువు, నలుపు అనే మూడు రంగుల్లో దొరుకుతాయి.
అనగా ఆ నాటికే 90 రకాల అయస్కాంతాలు లెక్కతేలాయి.
క్రీ.పూ.800 నాటి కణాదుని న్యాయదర్శనంలో మైక్రోస్కోపు వంటి పరికరం ప్రస్తావన వుంది.
‘‘అప్రాప్యగ్రహణం కాచాభ్రపటలస్ఫటికాంతరితోపలబ్ధేః’’
మామూలు కంటితో చూడటానికి సాధ్యంకాని సూక్ష్మ పదార్థాలు, గాజు, అభ్రకము, స్ఫటికముల వంటి పొరలతో చూచినపుడు కనిపిస్తాయి.
(న్యాయదర్శనం, 3వ అధ్యాయం, 46సూత్రం)
కళ్ళజోళ్ళ ప్రస్తావన యోగవాశిష్టంలో కూడా వుంది.
మహావిద్యోనయనా
చిద్భవత్యభిధా సతీ
సా జీవత్వేన బాహ్యత్వం
తదాద్వీంద్వివ పశ్యతి
(ఏ భేదాలు లేకుండా అద్వితీయంగా వున్న పరబ్రహ్మ, అవిద్య అనే కళ్ళజోడు పెట్టుకొనేసరికి ఆకాశంలో వున్న చంద్రుణ్ణి ఇద్దరు చంద్రులుగా చూసినట్లుగా, తనను తానే రెండుగా చూసుకుని, అందులో ఒక రూపానికి జీవుడు అనే పేరు తానే పెట్టుకుంది. ఆధునికుల లెక్కల క్రపారం యోగవాశిష్ఠం క్రీ.పూ.6వ శతాబ్దానికి చెందుతుంది)
ఇక్కడ ‘పనయనం’ అనే పదానికి వ్యాఖ్యాత రంగుటద్దాల కళ్లజోడనే అర్థం చెప్పాడు. చరక శశ్రుతాది పురాతన ఆయుర్వేద గ్రంథాలలో కూడా స్ఫటికాభ్రాదులతో చేసిన ఉపనేత్రాల వివరణ వుంది.
వరాహమిహిరుడు (క్రీ.శ.6 శతాబ్ది) బృహత్‌సంహితలో ఇంద్రధనుస్సును గురించివివరణ ఇలా వుంది.
‘‘సూర్యస్య వివిధ వర్ణాః పవనేన విఘట్టితాః కరాఃసాభ్రే!
వియతి ధనుః సంసాథనాః యే దృశ్యంతే తదింద్రధనుః
(ఆకాశం మేఘావృతమై వున్నపుడు, గాలి వలన చెదిరిన సూర్యుని వివిధ వర్ణ కిరణాలు, ధనురాకారంగా గోచరించి ఇంద్రధనుస్సుగా పేర్కొనబడతాయ)
(ఇక్కడ- పవనేన (గాలి వలన చెదిరిన)అనే పదాన్ని కిరణాల విశే్లషణ అనే అర్థంలో స్వీకరించాలి)
కొలమానాలు
భౌతిక శాస్త్రం అభివృద్ధికి మానవుడు వినియోగించేకొలమానాలు కూడా ఒక సూచిక.
పొడుగు, బరువు, వెడల్పు, ఘపరిమాణం, వైశాల్యం, కాలం, ఉష్ణోఘ్ర- ఇలాటి భౌతిక లక్షణాలను నిర్దిష్టంగా కొలవగలిగిన మానవుడు, ఆయా కాలాలలో, ఆయా పదార్థాలను అదుపులోకి తెచ్చుక్ని, వినియోగించటం నేర్చుకున్నాడని అర్థం అవుతుంది.ఈవిధంగా ఆనాటి సంస్కృతిని, అభివృద్ధిని, అంచనా వెయ్యవచ్చు. అతి ప్రాచీనకాలం నుండి మన వైదిక సంఘం రకరకాల కొలమానాలను వాడుతూండేదని, అందుచేత ఆ మేరకు ప్రగతిశీలంగా వుండేదని వేదాలవల్లే తెలియవస్తోంది.
బరువు కొలమానాలు
యజ్ఞంలో వాడవలసిన పదార్థాల బరువును తెలుపుతూ, అతిప్రాచీనమైన కృష్ణ యజుర్వేదంలో ‘బరువు’ను తెలిపే ‘కొలమానం’ ప్రస్తావన ఇలా వుంది.
‘‘చత్వారి చత్వారి కృష్ణలానిః’’ (తైత్తిరీయ సంహిత 2.3.6)
(నాలుగేసి గురిగింజల బరువు చొప్పున) దీనినిబట్టి బరువు తూచే విధానం అప్పటికే వుందని అర్థం అవుతోంది. పాశ్చాత్య దేశాలలో రుూ తూనిక త్రాసును. బి.సి. 3వ శతాబ్దం నాటికి ఆర్కిమెడిస్ మొదటిసారిగా కనిపెట్టాడని చెపుతున్నారు.
కృతయుగం నాటి మనుస్మృతిలో అతి విపులమైన బరువు తూచే కొలమానం ప్రస్తావించబడింది. అత్యంత స్వల్పమైన ‘‘త్రసరేణువు’’అనే కొలత దగ్గరనుంచి, దాదాపు ఇరవై కొలతల పట్టిక యివ్వబడింది.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి