Others

రుధిర రోదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిడికెడు గాలిని
నాసిక పుటల్లో నింపుకోగానే
పేగులను కోసుకుంటూ
సంచిలో కూలబడింది
కొద్దికాలం తర్వాత
సంచి కూడా తెగిపోయంది

నదిని నిటారుగా నిలబెట్టి
దోసెడు నీళ్లను పిండుకొని
నోట్లో వేసుకున్నారు
కాసేపటికే నరాలగుండా
కాలువలు ప్రవహించి
ఎండిపోయి న బ్రతుకులు
చరిత్రకు చిహ్నమై నిలిచింది

గుండెను వలిచి
నమ్మకాన్ని
రుధిరంలో కలుపుకున్నారు
రక్తం పగిలిపోయి
రాళ్ళు కుప్పలు కుప్పలుగా
భూమిపై పడ్డాయ
రాళ్ళ ఘనత ప్రవచిస్తుంటే
శూన్యం అయోమయంగా విన్నది

రంగుల కోసం సీతాకోక చిలుకలు
రాత్రంగా నగ్నమయ్యాయి
గాలి, నీరు, నమ్మకం
ఎవరూ కూడా రంగులివ్వలేదు
మరుసటి రోజు
వారికి కామోదయమయ్యంది

చీకటి జీవితాలు
పాకుడురాళ్ళుగా మారి
నేటికీ రోదిస్తూనే ఉన్నాయ
అక్షరాలు సత్యాలను లిఖిస్తే
బాధగానైనా... ఆనందంగానైనా
ఏదో ఒక రూపంలో
నాలుకలపై నర్తిస్తూనే ఉంటాయి

- జాని తక్కెడశిల, 9491977190