Others

ప్రణాళిక అవసరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువుకైనా, ఉద్యోగానికైనా, ఇంకాచెప్పాలంటే ఇంట్లో ప్రతిరోజు చేసే పనులకైనా సరే ఒక ప్రణాళిక ఉండాల్సిందే మరి. ప్రణాళికతో చేసే పనుల్లోకి ఏదైనా ఒక కొత్త పని చేరితే కూడా ఆ పనిని
సంపూర్ణంగా చేసే అవకాశం వస్తుంది.
ఏది చేసినా ప్రణాళికతో చేస్తే ఆ పని సౌకర్యవంతంగా సాగుతుంది. చదువుకైనా, ఉద్యోగానికైనా, ఇంకాచెప్పాలంటే ఇంట్లో ప్రతిరోజు చేసే పనులకైనా సరే ఒక ప్రణాళిక ఉండాల్సిందే మరి. ప్రణాళికతో చేసే పనుల్లోకి ఏదైనా ఒక కొత్త పని చేరితే కూడా ఆ పనిని సంపూర్ణంగా చేసే అవకాశం వస్తుంది. ఇపుడు పిల్లలు పెద్దలు అందరూ బిజీగా ఉండే వాళ్లే. పిల్లలు చదువుతో బిజీ అవుతారు. వీరు చదువుకోవడానికి కూడా ఒక ప్రణాళిక అవసరమే. లేకుంటే ఏ రోజు చదువు ఆరోజు చదవకుండా పరీక్షల టైమ్‌లో హాడావుడిగా చదివేసి ముక్కున పట్టుకుని వెళ్లి పరీక్షల్లో రాసేస్తాం అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ర్యాంకులు కాదుకదా కనీసం పాస్ అవుతారు అని చెప్పలేం. అట్లాగాక చదవాల్సిన చదువు అందులో ఏది ఎంత సేపు దృష్టి పెడితే పూర్తి అవగాహన వస్తుందో అన్నది చూసుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాని తరువాత చదువు మొదలుపెడితే చాలు వారు చదువులో ముందుంటారు. ర్యాంకుల సాధనలో అనాయాసంగా ముందుంటారు.
అట్లానే పెద్దవాళ్లు కూడా వాళ్లు చేయాల్సిన పనులకు ఒక ప్రణాళిక తప్పనిసరిగా చేసుకోవాలి. పనులు ఎక్కువై ఆలోచన్లు ఎక్కువైన ఈ కాలంలో మతిమరుపు కూడా వస్తోంది. కనుక ఏ పని ఎప్పుడు, ఎంత సేపు చేయాలో నిర్ణయించుకుంటే ఆ పనికున్న ప్రాధాన్యతను బట్టి పనిని ముందో వెనుకో చేయాలి.
ఆఫీసుల్లోకూడా అప్పగించిన పనుల్లో ఏది ముందు చేయాలి, ఏది తరువాత చేయాలన్నదాన్ని విచక్షణతో ఆలోచించుకోవాలి. అందరూ ననే్న మంచి పని చేసేదాన్ని అనాలనుకొని అన్నీ పనులు నెత్తిన మీద వేసుకోవడం మంచిది కాదు. అట్లాఅని అత్యవసర సమయంలో పని తెలిసి ఉండి కూడా ఆ పనిని నాది కాదు అని వ్యవహరించడమూ మంచిదికాదు. సమయాన్ని బట్టి పని చేయడం నేర్చుకోవాలి. ఏ పని ఏవిధంగా చేస్తే సులభమవుతుంది. మంచి రిజల్ట్ వస్తుంది అని కూడా ఆలోచించాలి. ప్రణాళిక ఉండాలి కదా అని యాంత్రికంగా చేయకూడదు. నవ్యత లోపించకూడదు. కొత్త పరికరాలతోకొంగొత్త ఆలోచనలతో పనిని చేయాలి. అపుడే ఆ పనికి తగ్గ ఫలితం ఉంటుంది.

-జంగం శ్రీనివాసులు