ఆంధ్ర గాథాలహరి

చంద్రుని చిద్విలాసం -11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
అమ అమ అగ అణసే హర! ర అణీ ముహతిలహ! చందదేఛివసు!
ఛిత్తో జోహిం పి అఅమో మమం పితే హిం వి అకరేహిం (హాలుడు)

సంస్కృత ఛాయ
అమృతమయ గగన శేఖర! రజనీముఖ తిలక! చంద్రహీస్పృశ
స్పృష్టో యైః ప్రియతమో మామపి తైరేవకరైః

అదే చల్లదనం నాకూ కావాలి
తే.గీ నా మనోహరుని మదికి నయము గూర్చు
సాంద్ర శీతమయూఖ సుస్పర్శ నాకు
సైతము, కలుగజేయుము శతమయూఖ!
అమృతమయ! యామినీవదనాబ్జ తిలక!
చిరకాలం పతికి దూంరగా ఉండడంవల్ల విరహంతో బాధపడుతున్న నాయిక ‘‘నా ప్రియుణ్ణి ఏ చల్లని కిరణాలతోనైతే స్పర్శించి ఆనందం కలుజేస్తావో, అవే కిరణాల స్పర్శతో నాకు సైతం ఆనందం కలిగించమని’’ అమృతమయుడైన చంద్రుణ్ణి వేడుకొంటున్నది’’. అమృతం అందరినీ బ్రతికించే దివ్య పదార్థం కదా!
ఈ గాథలో నాయక చంద్రుణ్ణి అనేక విధాలుగా సంబోధిస్తోంది. అమృతమయ అంటే అమృతము కలవాడని అర్థం. చంద్రుడు ప్రసరించే కిరణాలేకదా. దేవతలకు ఆహారం. చల్లని పండు వెనె్నలలోనే కదా యువ హృదయాలకు వినోదాలూ, విహారాలూ. ఇంకో సంబోధన యామినీవదనాబ్జ తిలక అంటే రాత్రి అనే కన్యకు అందమైన బొట్టులా చందురుడు చక్గా సరిపోతాడు. మన పూర్వీకులు ప్రకృతితో ఎంత మమేకమ య్యారో తెలిపేందుకే ఈ గాథ ప్రత్యక్ష సాక్ష్యం,. నేడు ఇరుకు అపార్ట్‌మెంట్ల కాంక్రీటు కీకారణ్యంలో మనకు చంద్రుడు కనపించడు. ఒకవేళ ఆయన కనిపించడానికి వచ్చినా సంపాదనాపరులుగానో, లేక చదువుకొనే వారిగానో ఉంటున్న మనుష్యులు రాత్రి చంద్రుని చూసే టైమ్ వేస్ట్ అనుకొంటూ గడిపేస్తున్నారు. కాని ఆయన విరజిమ్మే చల్లని కిరణాలను ఆస్వాదించే మనసును దూరం చేసుకొంటున్నారు. దానివల్ల ఎంత నష్టపోతు న్నారో చూసుకోవడం లేదు. ఇలా కొందరే సుమా.
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949 10