Others

సంప్రదాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిని వర్థిల్లజేసేందుకు, సమాజం పురోగతిని పొందేందుకు సమాజంలో ప్రతివారు మంచి నడవడితోఇహపర సుఖాలు పొందడానికి వీలుగా పూర్వీకులు కొన్ని నియమాలను , కట్టు బాట్లను పెట్టారు. అవి సమాజ హితమైనవి కనుక వాటిని సత్సంప్రదాయాలన్నారు. కొన్ని మూఢనమ్మకాలు, మరికొన్న సమాజాన్ని తిరోగతి పాలు చేసేవి కూడా ఉన్నాయ కాని వాటిని విడనాడి నేటి కాలంలో ఏవి సమాజోద్దరణకు ఉపయోగపడుతాయో వాటిని నేడు కూడా ఆచరింపచేయాలని పెద్దలు చెబుతున్నారు.
సంప్రదాయాల్లో దైవికమయినవనీ, లౌకికమయినవనీ, భౌతికమయినవిగా ఉండవచ్చు గాక. దైవ సంబంధమైన పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, ఊరేగింపులూ, పండుగలూ, జాతరలు మొదలైనవి ప్రముఖమైనవి. పూజా కార్యక్రమాల్లో శారీరకంగానూ, మానసికంగానూ పరిశుద్ధంగా ఉండాలి. కుటుంబంలో ఎటువంటి అశౌచ పరిస్థితులూ ఉండకూడదు. పవిత్ర చిత్తంతో కార్యక్రమాలు నిర్వహించాలి. దేవాలయాల్లో ప్రవేశించేటప్పుడు శుభ్రమైన దుస్తులతోపాటు నిష్కల్మష హృదయాలు కలిగి ఉండాలి.
శిశువు పుట్టినప్పుడు కొన్ని సంప్రదాయాలను, ఆచారాలను పెట్టి ఉన్నారు. వాటిని పాటించడం వల్ల అటు అపుడే పుట్టిన శిశువు ఆరోగ్య ఐశ్వర్యాలు. ఇటు పెద్దవారికి శుభాలు కలగాలన్న నిబంధనతోపెట్టారు. అవి నేటి కాలంలో వేటిని చేయవచ్చో బాగా పరిశీలించి క్షుణ్ణంగా ఆలోచించి చేయాలి. అట్లానే
కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు సంప్రదాయానుసారంగా ఖననం చేయడమో లేక దహనం చేయడమో జరుగుతోంది. దైవజ్ఞుల సూచనలమేరకే దశ దిన కర్మలూ, పిండ ప్రదానాలూ దాన ధర్మాలూ సంప్రదాయం మేరకే జరుగుతాయి. ఇట్టి సంప్రదాయాలు ప్రాచీనులు ఏర్పరచిన పద్ధతుల్లోనే జరుగుతాయి.
పండుగలు, పబ్బాలు, ఉత్సవాలూ ఊరేగింపులూ జాతరలూ ఏయే సమయాల్లో ఎలా నిర్వహించాలి అనేవి కూడా సంప్రదాయానుసారమే నిర్వహించబడతాయి. పండుగల సందర్భాల్లో అభ్యంగన స్నానాలు చేయడం, కొత్త బట్టలు ధరించడం, దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం అనేవి సమాజంలో జరిగే సత్సంప్రదాయాలే!
దేవతా విగ్రహాలను ఊరేగించే సమయంలో ప్రతివారూ తరతమ భేదాలు విడిచి భక్తిప్రపత్తుల్లో ఆధ్యాత్మిక భావాలతో పాల్గొనడం వల్ల ప్రజలోల ఐకమత్యం, ఒకరికొకరు సాయం చేసుకోవడమనేవి కలుగుతాయ కనుక ఇవి సత్సంప్రదాయాలే అవుతాయ. పూర్వీకులు పెట్టిన నియమాలను హేతుబద్ధంగా ఆలోచించి చేయగలిగితే దాని వెనుక ఉన్న రహస్యాలు తెలుస్తాయ. అవి మానవాళికి ఎంత ఉపయోగ పడుతాయో తెలుస్తుంది. మనిషి పురోభివృద్ధి కలిగించే ఏ సంప్రదాయమైనా ఏ నియమమైనా పాటించితేనే మంచిది.

-చోడిశెట్టి శ్రీనివాసరావు