Others

‘మావయ్య అన్న పిలుపు( నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా పాటలు ఎన్నో మధురమైనవి వున్నాయి. వాటిలో ఒక చెల్లిని ఓదారుస్తూ అన్నయ్య పాడే ‘ముద్దుల మావయ్య’ చిత్రంలో ‘మావయ్య అన్న పిలుపు’ పాట నాకు చాలా నచ్చిన పాట. ఈ పాటలో చెల్లిని వర్ణిస్తూ అన్నగా బాలకృష్ణగారు అభినయించే సన్నివేశం ప్రతి ఒక్క చెల్లెమ్మకూ కంట తడి పెట్టిస్తుంది. చెల్లెలుగా సీత నటన అపూర్వం. ‘అరచేత పెంచాను చెల్లిని... ఈ అరుదైన బంగారు తల్లిని...’ అన్న చరణం వింటే ఎంత ప్రేమో మనకీ తెలుస్తుంది. గీత రచయిత వెనె్నలకంటి చాలా చక్కగా రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శైలజ, సుశీల గానం చేసిన ఈ పాట ఈ చిత్రానికే హైలైట్. సంగీతం కె.వి.మహాదేవన్‌గారు చక్కగా అందించారు. ‘మావయ్య అన్న పిలుపు మా ఇంట్లో ముద్దులకు పొద్దుపొడుపు’ అన్న ఈ పాట బాలకృష్ణ అభిమానులు మరువలేని పాట. అందుకే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.

-ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం