Others

ఊహలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్సనే సాగరం పై
అలల్లా పరుగులు తీసే ఊహలు
నిద్రలోనే కాక
మెలుకవలోనూ మనతో
గుసగుసలాడుతాయి!
కోరికలకు
రంగు రంగుల రెక్కలు తొడిగి
మనల్ని
ఆశల పల్లకీలో ఊరేగిస్తాయి!
గాలిలో మేడలు కట్టించేందుకు
మన వెన్ను తడుతూ
ముందుకు తోసి
ముచ్చట తీర్చుకుంటాయి!
కలల లోకంలో
విహరింప చేస్తూ...
కమ్మని అనుభూతులకు
తెరలేపుతాయి!
మనోహర భావాలతో
మనల్ని
మైమరిపించ
మనో ఫలకం పై నాట్యం చేస్తాయి!
వాటి మృదు స్పర్శతోనే
అంతరంగ ఆకాశంపై
అందమైన హరివిల్లుల ఆవిర్భావం
అవి రంగవల్లులు దిద్దడానికి
వేదికవుతుంది
మన హృదయ ప్రాంగణం!

- దాస్యం సేనాధిపతి, 9440525544