Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిదుపాళ్ళు మాషయూషం (మినపప్పు కట్టు), తొమ్మిదిపాళ్లు గుడం, ఎనిమిదిపాళ్ళు పెరుగు, రెండు పాళ్ళు ఆజ్యం, ఏడు పాళ్ళు ఫాలు, ఆరు పాళ్ళు చర్మం, పదిపాళ్ళు త్రిఫలం, రెండుపాళ్ళు నారికేళం. ఒక పాలు తేనె, మూడు పాళ్ళు కదళీఫలం, వీటితో చూర్ణం తయారుచేయాలి.
లబ్ధే చూర్ణే దశాంకే తు యుంజీతవ్యం సుబంధనమ్
సర్వేషామధికం శస్తం గుడం చ దధి దుగ్ధకమ్
ఇలా వచ్చిన చూర్ణాన్ని తీసుకుని, దానిలో పదోవంతు సున్నాన్ని దానికి కలపాలి. అపుడు మంచి బంధనం (సిమెంటు వంటి ద్రవ్యం) ఏర్పడుతుంది. పైన చెప్పిన పదార్థాలలో బెల్లం, పెరుగు, పాలు అనేవాటిని ఎక్కువగా వాడడం మంచిది’’ అని అర్థం. ఇది మయమతం (క్రీ.శ.ఆరవ శతాబ్ది) చెప్పిన సిమెంటు వర్ణన. ఇదిగాక కళామూల శాస్త్రం మొదలైన గ్రంథాలలో ఇంకా విస్తారమైన సున్నపు తయారీ విధానాలను వివరించారు.
మన పూర్వమహర్షులు పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలను, అటు హోమద్రవ్యాలుగాను, ఇటు సున్నం వంటి రసాయనిక ద్రవ్యాల నిర్మాణాలలోనూ కూడా వినియోగించే విధానాలను నిర్దుష్టంగా చెప్పటాన్ని బట్టి, వారికి ఆ ద్రవ్యాల రసాయనిక లక్షణాలు ఎంతో విశదంగా తెలుసునని, ప్రకృతిసిద్ధ పదార్థాల విషయంలో ఇవాళ్టి మన పరిశోధనలకంటే ఆ నాటివాళ్ళ పరిశోధనలు మరో అడుగు ముందే వుండేవని మనకు అర్థవౌతుంది.
స్తంభాలు: భవన నిర్మాణంలో స్తంభాలు ప్రధానంగా నిలుస్తాయి. వీటిని గురించిన ప్రసక్తికూడా మయమతంలో వుంది.
మేషయుద్ధం త్రిఖండం చ సౌభద్రం చార్ధపానికమ్‌
మహావృత్తం చ పంచైతే స్తంభానాం సంధయః స్మృతాః॥
భవన స్తంభాల నిర్మాణంలో అయిదు ప్రధాన భాగాలు వుంటాయని, వాటి పేర్లు మేషయుద్ధం, త్రిఖండం, సౌభద్రం, అర్ధపానికం, మహావృత్తం- అనీ మయమతం నిర్దేశిస్తోంది. ఈ భాగాల సాంకేతిక వర్ణనలు కూడా వివరంగా యివ్వబడ్డాయి.
శిలాస్తంభాలు, సున్నపు స్తంభాలు, కొయ్య స్తంభాలు కూడా వివరించబడ్డాయి.
దారుస్తంభాల విషయంలో తలక్రిందులుగా ఎప్పుడూ స్తంభం నిలపరాదని చెప్పాడు. వృక్షకాండం అధోభాగం లావుగా, అగ్రభాగం సన్నగా వుంటుంది గదా! తలక్రిందులుగా ఏ తెలివితక్కువ వాడన్నా నిలుపుతాడా?- అని మనం అనుకోవచ్చు.
దారు స్తంభాన్ని డిజైన్లు చెక్కినప్పుడు (పలకలుగానో, వృత్తాకారంగానో, లతలు వగైరాలుగానో) మొదలేదో, చివరేదో తెలియదు. అప్పుడు పొరపాటు జరిగే అవకాశం వుంటుంది. అలాటిచోట్ల కూడా పొరపాట్లు చెయ్యకూడదని వివరించబడింది.
ఇలా ఎన్నో గ్రంథాలలో ఎందరో అలనాటి ఇంజినీర్లు వ్రాసిన నిర్మాణ సూత్రాలు వేదకాలంనుంచీ మన దేశంలో వ్యాపించి వున్నాయి.
ఇలా సంస్కృత వాఙ్మయంలో ఇంజినీరింగ్, వాస్తు, ఆర్కిటెక్చర్, ఆలయ నిర్మాణశాస్త్రం మొదలైన అనేక శాస్ర్తియ విషయాలు వివరించబడిన గ్రంథాలు అనేకం వున్నాయి.
మయమతము, మానసారము, సమరాంగణ సూత్రధారము, మత్స్యపురాణము, అగ్నిపురాణము, బృహత్ సంహిత, అర్థశాస్తమ్రు అనేవి వాటిలో కొన్ని.
‘వాస్తుసూత్రము’అనే గ్రంథంలోని శైలభేదన సూత్రంలో నిర్మాణానికి పనికివచ్చే శిలలు, వాటిలోని రకాలు, వగైరాలు వివరంగా చెప్పబడి వుంది. ప్రధానంగా ఆరు రకాల శిలలు చెప్పబడ్డాయి.
(1) హిరణ్య రేఖిక (బంగారు రంగు గీతలు గలవి) (2) సమవర్ణ (ఒకే రకం రంగు గలవి) (3) తామ్ర (రాగి రంగుగలవి) (4) ధాతుపుటితా (రంగు రంగుల ధాతువులు గలవి) (్ధతువులు అంటే శిలలలో వచ్చే వికారాలు. (5) వజ్రలబ్ధా (వజ్రము వంటివి) (6) సైకతాలికా (ఇసుక రాళ్ళు.)
బంగారు రేఖలు గల శిలలు విగ్రహాలు చెక్కడానికి పనికిరావు. సమవర్ణ శిలలలో నలుపు, పసుపు, ఇటుక రాతిరంగు గలవి ఏవైనా, మూల విగ్రహమూర్తులు చెక్కడానికి పనికివస్తాయి. తామ్రవర్ణ శిలలు కొండల నుంచి పగలగొట్టకముందే పౌరాణిక ఘట్టాల లాంటివి చెక్కడానికి పనికి వస్తాయి.
ఇలా ఏయేరకాల శిలలు ఎలాటి నిర్మాణాలకు పనికొస్తాయో వివరించబడి వుంది.
మత్స్యపురాణం క్రీ.పూ.5వ శతాబ్దం నాటిదని ఆధునికుల అంచనా. అందులో అర్చాప్రతిమా నిర్మాణ వర్ణనంలో బంగారం, వెండి, రాగి, రత్నాలు, శిలలు, దారువు, లోహాలు, మిశ్రమ లోహాలతో (ఇనుము, రాగి, యిత్తడి, కంచులతో) చేసిన అర్చాప్రతిమలు పూజకు పనికి వస్తాయని వుంది.
అనగా దాదాపు అన్నిరకాల లోహాలూ ఆనాటికి వినియోగంలో ఉన్నట్లే.
ప్రతిమా నిర్మాణానికి కావలసిన సాధనాల గురించీ (ఉలి, సుత్తి మొదలైనవి), రసాయనాల గురించీ కూడా అనేక వివరాలున్నాయి.
వాస్తు సూత్ర- ఉపనిషత్తులో అయిదు రకాల ఉలులు వర్ణించబడ్డాయి. ఆ ఉలులను గోమూత్రంలో ముంచి, ఇంగిడం అనే పదార్థాన్ని పూసి, చర్మం మీద సానపెట్టేవాళ్లు.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి