Others

పరిమాణం సూక్ష్మాణువే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం
*
డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
9490947590
*
ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*
కావున మన శరీరమందలి చైతన్యమంతయు ఆత్మవల్లనే కాని, వేరొక భౌతిక సమ్మేళనము వలన సాధ్యపడదని తెలియుచున్నది. ఆత్మయే ప్రథమ మూల ప్రకృతి. అంటే ఆకాశతత్త్వంగా భావించాలి. అది ఎట్లనిన, భూమికి మూలం నీరు, నీటికి మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు. వాయువుకు మూలం ఆకాశం. ఆకాశానికి మూలం ఆత్మ. అదియే మూల ప్రకృతి. ఇది అవ్యక్తము- మాయ. అవ్యక్తము కారణముకాగా వ్యక్తము కార్యము.
ముండకోపనిషత్తు నందు కూడ ఆత్మ యొక్క పరిమితి శక్తి, విస్తరణల గురించి వివరంగా చెప్పబడింది.
శ్లో ‘‘ఏషో ణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణాః పంచధా సంవివేశ
ప్రాణైశ్చిత్తం, సర్వమోతం ప్రజానాం, యస్మిన్ విశుద్ధే విభవత్యేష, ఆత్మా’’
భావార్థం: సూక్ష్మాణుపరిమితమైన ‘ఆత్మ’ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములను అయిదు విధములైన ప్రాణ వాయువులలో తేలి ఆడుచు హృదయస్తమై యుండి, బద్ధజీవుల శరీరములందంతట నూతన ప్రభావమును చైతన్య రూపములో, ప్రవహింపచేయుచున్నది. అందువల్ల పంచవిధములైన ప్రాణవాయువులను శుద్ధి యొనర్చి వాటి కాలుష్యమును తొలగించినగాని, ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రభావము ప్రకటితము కాదు. హటయోగాది ఆసనముల ప్రయోజనమిందుకొరకే. మన వేద వాఙ్మయ భాగములన్నింటియందును అణు రూపాత్మకమైన ఆత్మ యొక్క స్థితి నిర్మాణము అంగీకరింపబడినది. ప్రతి జీవి యొక్క హృదయమందు అణురూపమైన ‘ఆత్మ’ యుండును. ఇట్టి ఆత్మ యొక్క పరిమితి లేక స్థితి, భౌతిక శాస్తజ్ఞ్రుని, దృష్టికి లేక పరికరముల ద్వారా అందనిది. అందువల్ల కొందరు, ఆత్మయే లేదని వాదింతురు. విశ్వవ్యాప్తమైన పరమాత్మ వలెనే, మిక్కిలి సూక్ష్మాణు పరిమితిగల ‘జీవాత్మ’ కూడా హృదయ స్థితి నొందియుండుట యధార్థము. మరియు నిర్వివాదాంశము. శరీరమున జీవాత్మ ఉనికి వల్లనే దైహిక చలన శక్తులు కలుగుచున్నవి.
మనలో ఊపిరితిత్తుల నుండి, ప్రాణవాయువును గ్రహించు, రక్తకణములన్నియు, ఆత్మనుండియే శక్తిని గ్రహించుచున్నవి. ఆత్మ శరీర స్థితి నుండి తొలగిపోగానే, రుూ రక్త ప్రసరణ క్రియ ఆగిపోవును. ఆధునిక వైద్య శాస్తమ్రు రక్తకణముల ప్రాముఖ్యతను, హృదయము యొక్క అస్థిత్వమును అంగీకరించును. కాని ఆ శక్తులకు మూలమైన ఆత్మను గురించి వివరించదు. కాని వేద విజ్ఞానమైనను, ఆధునిక విజ్ఞానమైను, దేనిననుసరించినను, శరీరమునందు జీవాత్మ ఉనికి నంగీకరించవలసినదే!
ఆత్మను జీవుడని వ్యవహరించుటెట్లు? జీవునికి అట్టి భ్రాంతి ఎట్లు కలుగును? అను ప్రశ్నలకు సమాధానము కొంత చర్చించి తెలిసికొనవలసియున్నది. మన తత్త్వ శాస్తమ్రుల యందిట్టి చర్చ సవిస్తరముగను, సువిశాలముగనున్నది. అట్టి విషయమంతయు నిచ్చట పొందుపరచుట నాకసాధ్యము. అయినను కొంత విచారణ చేయుదుము.
శ్రీ ఆదిశంకరాచార్యులవారి ‘కఠోపనిష్తు భాష్యము’ నందలి రుూ శ్లోకమును పరిశీలిద్దాము.
శ్లో ‘యచ్ఛాప్నోతి యదాదత్తే! యచ్చాత్రి విషయానిడుహ
యశ్చాస్య సంతతో భావః తస్మాదాత్మేతి కథ్యతే’’
ఇచట, ‘ఆత్మ’ పదమునకుగల ఉత్పర్యర్థముల ననుసరించి వివరణ చెప్పబడినది. వాటిని పరిశీలిద్దాం.
1.ఆప్నోతి ఇతి ఆత్మ: ఆప్నోతి అనగా పొందునది, దేనిని పొందునది- అనగా, నిద్రించుకాలమున, అంతఃకరణ వృత్తులు, సంహృతములైనప్పటి స్వరూప స్థితి ఆత్మలోనికి గ్రహించి, తిరోభావ స్థితి పొందునది ఆత్మ.
2.అదత్తే ఇది ఆత్మ: ఆదానము అనగా గ్రహించుట అని అర్థము. జాగ్రదావస్థ యందు చూచే, దృశ్యములను గ్రహించువాడు ఆత్మ.
3.అత్తి, ఇతి ఆత్మ: ‘అత్తి’ అనగా తినుట, భోగించుట అని అర్థం. శబ్ద, స్పర్శాది తన్మాత్రల (ఇంద్రియార్థములను) అనుభవించువాడు ఆత్మ.4.అనుస్యూతోభవతి, ఇతి ఆత్మ: అవస్థాత్రయము (జాగ్రత్త, నిద్ర, స్వప్నావస్థ) నందు, అనుస్యూతముగను, పదార్థ పరిణామ క్రియ యందును, సంతత భావమున నుండువాడు ‘ఆత్మ’.
*
- ఇంకా వుంది...