Others

ఆరోగ్య దాయని తులసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తులసి ప్రతివారింట్లో కనబడుతుంది. మంచి సువాసనతోపచ్చ పచ్చని ఆకులతో అలరారే తులసిమొక్కను మహిళలంతా ఆరాధిస్తుంటారు. తులసి కేవలం ఆరాధనకే కాదు ఆయుర్వేద వైద్యంలోను సరిలేని మొక్క. ఈ తులసి ఆకులను ప్రతిరోజు నములుతుంటే మంచి ఆరోగ్యం లభ్యమవుతుంది. తులసి ఆకుల రసాన్ని ఒక స్ఫూన్ ఒక చంచా తేనెతో కలపి సేవిస్తే కఫం తగ్గుతుంది. ఇక వర్షాకాలం చినుకులు పడటం, వాతావరణంలో తేమ ఎక్కువ కావడం లాంటివి ఎక్కువైవుతూ ఉంటాయి. వీటి బారిన చిన్నపిల్లలే కాదు తేమ సరిపోని వారు కూడా గురవుతుంటారు. అటువంటివారు తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకొంటే జలుబు, దగ్గు ఇటువంటివి రాకుండా ఉంటాయి. తులసి మొక్కలోని ప్రతిభాగమూ మనిషి ఆరోగ్యానికి పనికివస్తుంది. తులసి వేర్లతో చేసిన పొడిని ఒక చెంచా, శొంఠి పొడి ఒక చెంచాను తీసుకొని రెండింటినీ నూరి కుంకుడు గింజంత పరిణామంలో మాత్రలుగా తయారు చేసుకొని ప్రతిరోజు సేవిస్తే చాలా రకాల చర్మవ్యాధులు దూరం అవుతాయి. తులసి రసాన్ని, వెల్లుల్లి రసాన్ని కలిపి ఈ రసాన్ని రెండు మూడు చుక్కలు చెవిలో వేసుకొంటే చెవి నొప్పి తగ్గిపోతుంది. ఒక చంచా తులసి గింజలు ఓ కప్పు నీటిలో నానబెట్టి ఆ నీటిని సేవిస్తూ ఆ గింజలను కూడా సేవిస్తే కాళ్లునొప్పులు మటు మాయం అవుతాయి. మూత్రసంబంధ వ్యాధులు కూడా దూరమవుతాయి. తులసి పూజ చేయడంతో పాటుగా తులసి ఆకులను ప్రతిరోజు తీసుకొంటూ ఉంటే మానసిక వ్యాధులు కూడా దూరమవుతాయి.

-వెంకట లక్ష్మి