Others

నేర్చేసుకుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త హీరోయిన్లు వచ్చి కొద్దో గొప్పో పేరు సంపాదించారు అంటే ప్రేక్షకులకి మత్తుమత్తుగానే వుంటుంది. ప్రస్తుతం ఆ జాబితాలో ప్రేమమ్ ఫేం అనుపమా పరమేశ్వరన్ నిలుస్తోంది. ప్రేమమ్ చిత్రం తెలుగులో కూడా కథానాయికగా నటిస్తున్న అనుపమ, నటించిన అ ఆ సినిమా ఇటీవల విడుదలై ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది. అయితే, సినిమాలో సరైన పాత్ర కాకపోయినా, సమంతాను ఢీకొట్టే స్థాయిలో నటన సాగడంతో ప్రేక్షకులు వెంటనే గుర్తుపట్టేశారు. దానికితగ్గట్టు టాలీవుడ్‌లో అవకాశాలు కూడా వరుస వెంబడి వస్తున్నాయి. దీంతో అనుపమ చిలక పలుకులు పలుకుతూ, ఇక్కడ ఎలా మెలగాలో చెబుతోంది.
ముఖ్యంగా టాలీవుడ్‌లో మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌లు అద్భుతమైన నటులని చెబుతోంది. ఎక్కడినుంచో వచ్చి ఆమె ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ, హీరోల స్టామినాను గుర్తించి అవకాశాలకోసం అనుపమ ఆ విధంగా సోప్ వేస్తోందని అందరూ గుర్తించారు. ఈ రకంగా చూస్తే అనుపమ టాలీవుడ్‌ను టార్గెట్ చేసే ఈ మాటలు మాట్లాడుతోందని అర్థమవుతోంది. గతంలో కూడా ఇలా ఎంతమంది మాట్లాడలేదు!? రకుల్ ప్రీత్‌సింగ్ కెరీర్ ప్రారంభించిన మొదట్లో కూడా ఇలా పవన్, మహేష్‌ల భజన చేసింది. ఇప్పుడు ఆ స్థానాన్ని అనుపమ ఆక్రమించింది. ఈమె కూడా రకుల్‌లా టాప్ స్టార్‌గా ఎదుగుతుందేమో చూడాలి.