Others

అటు సంపాదన.. ఇటు సేవ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడైనా ఎక్కడైనా యువత సరికొత్త ఆలోచనలతో ఉంటుంది. అటువంటి ఆలోచనలే దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. సరికొత్త ఆలోచన్లు యువతకు నేడు ఉద్యోగ అవకాశాలను ఇవిగో అని ఎవరూ చూపక్కర్లేదు. వారే ఉద్యోగ అవకాశాలను వేరొకరికి చూపుతున్నారు.
అంతేకాదు వారు సంపాదించిన దానిలోను కొంత సొమ్ము, సొమ్ము లేనివారికి లేదా సొమ్ము సంపాదించడానికి వీలుకాని వారికి ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.
ఇదిగో అటువంటి వారి గురించి మనం తెలుసుకొందాం ఇప్పుడు. మేకింగ్ అవర్ సెల్ఫ్ బెటర్ అనే బృందం. ఈ బృందంలో కేవలం ముగ్గురే ఉండేవారు. మొట్టమొదట వీరు ముగ్గురు ఒక్క దగ్గరి చదువుకున్నారు. ఆ తరువాత చదువులో అభివృద్ధి చెందుతూ వేర్వురు ప్రాంతాలకు వెళ్లిపోయారు. కాని వారి మధ్య స్నేహం మాత్రం అట్లాగే ఉండి పోయింది.
వౌనిక, శృతి, నవీన్ వీరు ముగ్గురు స్నేహం విలువ తెలిసినవారు. అంతేకాదు చదువుకొనడంలో ఎంత ఇబ్బందులు ఉంటాయో కూడా అనుభవపూర్వకంగా తెలుసున్నవారు. అందుకే వారు ఉద్యోగాల్లో స్థిర పడిన తరువాత కొంత పైకాన్ని ఒక చోట కూడబెట్టారు. దాంతో సేవా కార్యాలను చేపట్టారు.
మొట్ట మొదట వీధుల్లో అడుక్కొనేవారి దగ్గరకు వెళ్లారు. వారికి కావలసిన తిండి సౌకర్యాలను కల్పించారు. చలికి తట్టుకోలేక పోతున్నవారికి దుప్పట్లు పంచిపెట్టారు.
కాని ఇవి అన్నీ తాత్కాలికమైనవి కదా. మరి శాశ్వతంగా వారికి ఉపయోగ పడే దేనినైనా మనం చేయాలనుకొన్నారు వారు ముగ్గురు. ఆలోచన ఉంటే చాలు కదా. మార్గాలు అనేకం వస్తాయి. ఈ విషయానే్న నెట్‌లో పెట్టారు. చాలామంది మంచి ఆలోచన అని వారిని మెచ్చుకున్నారు.
కేవలం మెచ్చుకోవడమే కాక వారి చేయూత కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరికొంతమంది కొంత విరాళాన్ని కూడా పంపారు. అంతా డబ్బును జమచేసి వెంటనే చదువుకోలేని వారిని గుర్తించి వారికి విద్యాసౌకర్యాన్ని వీరు కలిగించారు. పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, పుస్తకాలు ఇవే కాక స్కూల్లో చేర్పించడం లాంటివి కూడా చేసారు. వీరి సేవలను చూసి మరికొద్దిమంది తమ చేతులను కూడా కలుపుతామని ముం దుకు వచ్చారు. అలా వీరు ముగ్గురు మూడు వందల మందిదాకా ఎదుగుతు న్నారు.
ఇపుడు అందరూ చేరి కొన్ని టీమ్స్‌గా ఏర్పడి శనిఆదివారాలు ఎక్కడెక్కడ వీధుల్లో అడుక్కునేవారు ఉంటారో లేక చదువుకునే వయస్సులో చిల్లర పనులు చేస్తుంటారో లేక అంగళ్లల్లో, హోటల్స్‌లో, లేక ఇండ్లలో పనికి కుదిరి ఉంటారో వారిని గుర్తించి వారికి విద్య వలన వచ్చే లాభాలలను వివరించి వారిని బడిబాట పట్టిస్తున్నారు.
చూశారా.. మనసుంటే మార్గాలు అనేకం కనుక యువత అంతా నడుం కడితే దారిద్య్రాన్ని దూరం చేసి అభివృద్ధి చెందిన దేశం ఇండియా అని మేము చేయగలం అంటున్న ఈ వౌనిక, శ్రుతి, నవీన్‌లతో పాటు మీరు ఒక చేయి సాయం అందించడానికి ముందుకు రండి...

-మాధవి