Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

19. అశ్వత్థ పత్రం- రావిపత్రి (Ficus Religiosa) :- ధీని చెక్క రసము లేక కషాయము వగరు, తీపి, చేదు రుచులు కలిగి వుండును. జ్వరమును, మేహమును హరిస్తుంది. నోటి రసపు పట్టును, నోటి పూతను శమింపచేస్తుంది. దీని ఆకులు విస్తరిగాకుట్టి దానిలో భోజనము చేసిన దంతములకు బలము, విరేచనబద్ధము చేయును. రావి చెక్క కాల్చిన బూడిదనుండి తీసిన క్షారము శూల, అగ్నిమాంద్యము, గుల్మము, బల్లలు హరిస్తుంది.
20. అర్జునపత్రం- మద్ది ఆకు (Pentaptera Arjuna & Terminalia Grabra) :- దీని మ్రాను చెక్క చూర్ణము లేక కషాయము చలవ, మేహశాంతి చేస్తుంది. వ్రణాలు, విదాహము, గుందవ హృద్రోగము, జ్వరము, నోటిపూత, పుండులను పోగొడుతుంది. లేక ఆకు రసము చెవిలో పిండిన చెవినొప్పి హరిస్తుంది. ఆకు రసము పూసిన ఆమవాతపు (Rheumatism) నొప్పులు హరిస్తాయి. దీని ఆకుల భస్మము మానని మొండి వ్రణాలను మానేటట్లు చేస్తుంది. చెక్క భస్మమును తాంబూలములో సున్నమునకు మారుగ వాడని కఫమును, గుల్మమును హరిస్తుంది.
21. అర్కపత్రం - జిల్లేడాకు (Asciepias Gigantea & Caloatropis G) :- దీని వేరు, చెక్క చూర్ణము లేక కషాయము చేదుగ, వెగటుగ వుండును. మిక్కిలి ఉష్ణము చేస్తుంది. త్రిదోషాలు, వ్రణాలు, సవాయి రోగము, పొక్కులు, దురదలు, చర్మరోగాలు, కుష్ఠు, వాతము, గుల్మము, పక్షవాతము, మూర్ఛ, పాము, తేలు విషము, వాత నొప్పులు, జీర్ణజ్వరము, క్షయ మొదలైనవాటిని హరిస్తుంది. నాడా పాములను (Tapeworm) చంపును. పాము కరిచిన వెంటనే రెండు, మూడు జిల్లేడాకులు నమిలి మ్రింగినను, దీని వేరు నీళ్ళలో అరగతీసిన గంధము కరిచినచోట పూసి, కలికము వేసి, సుమారు తులమెత్తుగల గంధము లోపలికిస్తే విష హరమవుతుంది.
వరసిద్ధి వినాయక వ్రతంలో ఉపయోగించే ఏకవింశతి పత్రాల భౌతిక గుణాల గురించి ఇప్పుడు కొంచెం పరిచయం చేసుకున్నాము. ఈ మూలికలకు గల ఆధ్యాత్మిక లక్షణాలను గ్రహించాలంటే మనం యోగశాస్త్రంలోకీ, తంత్ర శాస్త్రంలోకీ వెళ్ళవలసి వుంటుంది. అదీగాక వీటి ‘ఆరా’ (Aura) గురించి కూడా వివరించవలసి వుంటుంది. గ్రంథ విస్తర భయంచేత ఆ విషయాలలోకి పోవటం లేదు.
**

హోమ విజ్ఞానము
ప్రపంచంలో అణువుల చలనాన్ని కలిగించేవి రెండే శక్తులు. ఒకటి ఉష్ణ శక్తి, రెండు శబ్ద శక్తి. ఇతర శక్తులు అణుచలనాన్ని కలిగించినా అవి ఉష్ణంగానో, శబ్దంగానో మారి, తద్వారానే చలనాన్ని కలిగిస్తాయి. ఇది ఈనాటి భౌతిక శాస్త్రం కూడా అంగీకరించిన సత్యం.
ఈ రెండు శక్తులను సమ్మేళనపరచి, తద్వారా బహిరంగ వాతావరణంలోను, అంతరంగ వాతావరణంలోను కూడా కాలుష్యాన్ని నిర్మూలించే ప్రక్రియే హోమం. హోమంలో అగ్నిని ప్రజ్వలించి మంత్రాలతో కొన్ని నిర్దిష్ట ద్రవ్యాలను మాత్రమే వేస్తారు. వేసే ద్రవ్యాలకు వున్న మూలికాగుణంవల్ల, వాటిల్లోంచి వచ్చే పొగ ద్వారా మూలికాశక్తి వాతావరణంలోకి ప్రవేశించి అక్కడ కాలుష్యాన్ని నిర్మూలిస్తుంది.
అలాగే మంత్రాల ఉచ్ఛారణతో అగ్ని జ్వాలలవల్ల పుట్టిన ఉష్ణశక్తి సమ్మేళితమై దగ్గరలో వుండే వారి హృదయాలలో నూతన ప్రకంపనలను జనింపజేసి తద్వారా ఆ హృదయాలలోని కాలుష్యాలను నిర్మూలిస్తుంది.
ఈమధ్య విదేశాలలో ‘హోమాథెరపి’ పేరుతో నూతన వైద్య ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిలో హోమాగ్ని వైద్యప్రక్రియగా వుపయోగించే ప్రయోగాలను విజయవంతంగా చేస్తున్నారు. మన దేశంలో యివి ఎప్పటినుంచో వున్నాయి. హోమాలలో వినియోగించే మంత్రాలనుబట్టి దానిలో వేయవలసిన మూలికలూ, ఇతర పదార్థాలు మారిపోతూ వుంటాయి. ఇది శాస్త్ర నియమం. ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే ఫలితాలు రుూనాటికీ ప్రత్యక్షంగానే కనిపిస్తాయి.
ఫొటోకెమికల్ ప్రక్రియ:
హోమాలలో పూర్తిగా వైజ్ఞానిక సిద్ధాంతం వుందటానికి మరో గుర్తు కూడా చెప్పుకోవచ్చు. అగ్ని ప్రధానంగా ప్రజ్వలించేది రాత్రి కాలం అయినప్పటికీ హోమాలకి ముఖ్యకాలం మాత్రం పగలే. ఎందువల్ల? మనకు సహజ సిద్ధమైన నిత్యాగ్ని సూర్యగోళమే! సౌరశక్తే మన జీవితాలకు శక్తినందిస్తోంది. హోమంలో మనం ఉపయోగిస్తున్నది కృతకమైన అగ్ని. ఈ అగ్నిద్వారా ఉద్భవించే శక్తిసౌరశక్తితో సమ్మేళనం చెందాలి. అప్పుడే అది భౌతిక, ఆధ్యాత్మిక ఫలితాలను సంపూర్ణంగా అందించగలుగుతుంది.
ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంవారు ఈ ప్రక్రియను ఫొటో కెమికల్ ప్రక్రియ అని పిలుస్తున్నారు. హోమ ధూమంలోని అణువులలో సూర్యకిరణాల ప్రతిస్పందన వల్ల ఈ ప్రక్రియ నిర్వహింపబడుతుంది. కనుకే హోమం పగటిపూట నిర్వర్తింపబడుతుంది. ఉదయ, సాయంకాల సంధ్యలలో సూర్యకిరణాలలోని అల్పతరంగ పరిమితిగల ‘‘అల్‌ట్రా వైలెట్’’ కిరణాల తరంగాలు అత్యధికంగా భూమిమీదకి ప్రసారవౌతాయని మనందరికీ తెలుసు. మానవ ఆరోగ్యంపై వీటి విశేష ప్రభావం కూడా మనకు తెలుసు. మనకంటే మన ఋషులకు ఇంకా బాగా తెలుసు.
*
ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి