AADIVAVRAM - Others

మన్మథలీల-మనుషుల గోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనాథుడు తన కావ్యాలలో శృంగారానికి వనె్న తెచ్చాడు. అలాగే అనేక మంది కవులు చేమకూర వెంకటకవి మొదలు, ఈనాటి అనేక మంది రచయితల వరకూ, శృంగార రసానుభూతిని కలిగించే రచనలు చేశారు. అవన్నీ మానసికానందాన్ని ఇస్తూనే ఉన్నాయి. చదివిన కొద్దీ చదాలనిపిస్తూనే వున్నాయి.
అయితే నేటి ఆధునిక భావజాలం వలన పరిస్థితిలో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. చదివి ఆనందించే ఓపిక ఎవరికీ లేదు. అందువలన మానసికంగా కన్నా, శారీరకంగానే ఆ రసానుభూతిని చవిచూడాలన్న తాపత్రయం, చిన్నాపెద్దా అన్న తారతమ్యం లేకుండా అందరిలోను ద్విగుణీకృతమై తమలో అంతకుముందున్న సద్గుణాలను, సద్దుమణిగేట్లు చేస్తున్నయ్. అందుకే తాకి చూడు, తైతక్కలాడి చూడు - అన్న మాటలు వాడుకలోకి వచ్చాయి. అలాగని అందరూ ఇలాంటి చౌకబారు శృంగార చేష్టలలో తేలిపోతున్నారని కాదు. చాలామంది ఈ వ్యాపకంపైనే, వ్యామోహం పెంచుకొని, పెచ్చుమీరిపోతున్నట్లు, జరుగుతున్న సంఘటనల వలన తెలుస్తోంది. ‘కామాతురాణాం, న భయం న లజ్జ’ అన్న పెద్దల మాట నిజమేనేమో ననిపిస్తోంది.
ముఖ్యంగా నేటి విద్యార్థినీ విద్యార్థులు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్, బాయ్‌ఫ్రెండ్స్ అనే నామకరణాలతో సాన్నిహిత్యాన్ని పెంచుకొంటూ, బుక్స్‌లోని వ్యాకరణాలతో పనిలేకుండా, సెక్స్‌కి సంబంధించిన, ఉపకరణాల కోసం ఎగబడుతూ లవ్వులు, లవ్వులనుకొంటూ, ఎక్కడబడితే అక్కడ, ఎలా బడితే అలా నవ్వులతో కాలక్షేపం చేస్తున్నారు.
టీవీలూ, సినిమాలలోని ద్వందార్థ సంభాషణల పుణ్యమా అని, ఒకానొక సందర్భంలో ఓ యువతీ యువకుల సంభాషణ ఇలా సాగింది.
‘ఏమిటలా చూస్తున్నావ్?’ అడిగాడు యువకుడు.
‘రేప్ చేస్తావేమోనని..’ అంది ఆ యువతి.
‘ఆ...! రేపటిదాకానా? ఎందుకు? ఇప్పుడే, ఇక్కడే.. ఈ క్షణంలోనే’ ఉద్రేకంతో ఊగిపోతూ అన్నాడా యువకుడు ఏ మాత్రం సంకోచం లేకుండా.
ఇలాంటి వీరసెక్సుతో, వీర లెవెల్‌లో సతమతవౌతుంటే, చదువులు చట్టుబండలు కాక ఏవౌతాయ్. శృతి మించుతున్న ఈ ప్రణయ ప్రసంగాల వలన, చాలా కొంపల్లో, ప్రళయ మేఘాలు కమ్ముకొని, కొట్లాటల తుపానులకు తెర లేపుతోంది. ఉజ్జ్వల భవిష్యత్తును రూపొందించుకోవాల్సిన యుక్త వయస్సులో దిక్కుమాలిన దృశ్యాలను సృష్టించుకొని, చేజేతులా తమకు తన్నుకొంటూ వచ్చే సదవకాశాల్ని కోల్పోతూ, అన్నింటినీ విస్మరించి, అటు తల్లిదండ్రులనూ, ఇటు సభ్య సమాజాన్నీ, విస్మయానికి గురి చేస్తున్నారు. ఇది నిజంగా శోచనీయం!
ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న, వివాహం కావాల్సిన యుక్త వయస్సుల వారి వ్యవహార శైలి ఇలా అఘోరిస్తుంటే, దాంపత్య జీవితంలోని కొందరు దంపతులు, సజావుగా సాగుతున్న సంసారానికి మధ్యలో ఏర్పడిన పైత్య వికారాల వలన, అక్రమ సంబంధాలతో అడ్డుకట్టలేసుకుంటున్నారు. జీవితాంతం తమకు బాసటగా నిలవాల్సిన, తమకే పుట్టిన అభం శుభం తెలియని బిడ్డల్ని, ఏ మాత్రం పట్టించుకోకుండా, తమతమ సుఖాలకు, అడ్డుగోడల్లా వున్నారని, వాళ్లను గొడ్లను బాదినట్లు బాది, ఒళ్లంతా వాతలు పెట్టి, తమ దారిన తాము ఊరేగుతున్నారు. పర్యవసానంగా హత్యలూ, ఆత్మహత్యలు!
సత్సంప్రదాయాలకు దూరమవుతున్న కొద్దీ దురాలోచనలు విజృంభించి, ఇటువంటి దుస్సంఘటనలకు దగ్గరవుతున్నారు. సమాజంలో నైతిక విలువలు పడిపోవడానికి, ఇటువంటి మన్మథ లీలలే కారణం. ఇటువంటి మనుషుల గోలను అరికట్టాలంటే, ప్రతి ఒక్కరూ నిగ్రహ శక్తిని పొందడానికి ప్రయత్నించాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. పశు ప్రవర్తన మానాలి. శీల సంపదను పెంపొందించుకోవాలి. మనం మనకోసమే కాదు, సమాజం కోసం కూడా సత్ప్రవర్తనను అలవాటు చేసుకోవాలి! దేశాభివృద్ధికి పాటుపడేలా అందరూ వ్యవహరించాలి.

-షణ్ముఖశ్రీ