AADIVAVRAM - Others

దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది తాము ఉదయం నిద్రలేవలేమని, రాత్రిపూట ఎంతసేపైనా మెలకువతో ఉండి పనులు చేసుకోగలమని అంటూ వుంటారు.
‘రాత్రి పక్షులు’ ‘ఉదయం పక్షులు’ అనే విధంగా వ్యక్తులు ఉంటారా?
త్వరగా పడుకోవడం, త్వరగా నిద్రలేవడం వల్ల మనిషి ఆరోగ్యంగా, తెలివిగా, ధనవంతునిగా ఉంటాడని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాడు. బ్రహ్మ ముహూర్తంలో పనులు చేస్తే చాలా మంచిదని మన పెద్దలు చెబుతారు.
ఉదయం లేవడం నిజంగా సాధ్యంకాని విషయమా?
ఇది ఒక్క ఉదయం నిద్ర లేవడం గురించే కాదు. చాలా విషయాల గురించి రకరకాల వ్యక్తులు రకరకాల అభిప్రాయాలు చెబుతూ ఉంటారు.
రోజూ అందరిలా వాకింగ్ చేయలేకపోతున్నానని మరి కొంతమంది వాపోతూ ఉంటారు.
అందరిలా ఇతరులని ప్రభావితం చేయలేక పోతున్నానని మరి కొంతమంది భావిస్తూ ఉంటారు. వ్యాపారం చేయలేక పోతున్నానని మరి కొంతమంది.
ఇలా చాలా విషయాలని చాలా మంది చెబుతూ వుంటారు.
వాళ్లు ఆ పనులు చేయలేరా లేక చేయడానికి సన్నద్ధులు కావడం లేదా?
ఇదీ ప్రశ్న.
ఇందుకు కావల్సింది - మన మనస్సులో వున్న స్క్రిప్ట్‌ని మార్చడం. ఈ స్క్రిప్ట్ మార్చితే ఉదయానే్న లేవగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో పనులూ, వ్యాపారాలు చేయగలుగుతారు.
దేనికైనా కావల్సినవి దీక్ష, పట్టుదల. ఇవి రెండూ వుంటే ఏమైనా చేయగలం.
నేను ఆ పనిని ఎందుకు చేయలేకపోతున్నానని ఎవరైనా వాళ్లు వేసుకోవాల్సిన ప్రశ్న.
వాళ్లు ఆ పనులు చేయలేరా?
చేయడానికి సన్నద్ధులు కావడం లేదా?
ఈ ప్రశ్నకి సమాధానం వాళ్లలోని ఆ పని చేయాలన్న కాంక్ష.
అది వుంటే చాలా పనులు చేయగలుగుతారు.

- జింబో 94404 83001