Others

బస్సు ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటువైపు నీవు పోవాలని నిలుచున్నప్పుడు
ఇటువైపు పోయె బస్సులే వస్తుంటవి
నీవు సరిగ్గా సమయానికి వచ్చినపుడు
బస్సు తప్పక లేటవుతుంది.
నిమిషం లేటయి వచ్చినా
బస్సు ముందు వెళ్లిపోతుంది.

హుందాతనం నాజూకుతనం
బస్సు డోరు వద్ద చెల్లని నాణాలవుతవి
మన ప్రజాస్వామ్య తీరుతెన్నులు
జనం బస్సెక్కేప్పటి స్థితిని చూస్తే తెలిసిపోతుంది.
సీటు దొరికిన ఫకీరు నవాబై కూర్చుండిపోతాడు
ఆఫీసరైనా బస్సులో అప్పుడప్పుడు
అటెండర్లా స్టాండవక తప్పదు
ఎన్నో తంటాలు పడి బస్సెక్కిన పెద్దమనిషే
మరో స్టేజి వచ్చాక చోట్లేదు
బస్సు ఆపకుండా పోనీమంటాడు
దేశాన్ని ఉద్ధరించాలన్న పెద్దమనుషులే
బస్సుల్ని కాల్చివేయిస్తారు.
నాటురకం, నాగరికం, హిపోక్రసీ, సుప్రిమసీ
బ్యూటీలు, లూటీలు, ఎనె్నన్ని సజీవ దృశ్యాలో ఈ వేదిక మీద
ప్రకృతీ పురుషుల అవిరామ విన్యాసాలూ,
అనంత లీలా భంగిమల చిత్రవిచిత్రాలూ
ఎనె్నన్నో ఈ కిటికీగుండా
అందాల భామల్నీ, హైక్లాస్ సమాజాన్ని మోసికొని
తారురోడ్డుపై డీలక్సులూ, లగ్జరీలు జారుతుంటవి
పల్లెటూరి వంకర టింకర్ల మట్టిరోడ్డుపై
డొక్కు బస్సులు కుంటుతూ నడుస్తుంటవి
వడివడిగా సాగే కాలప్రవాహంలో
గమ్యం గట్టు చేరాలంటే బస్సు ప్రయాణం తప్పనిసరి
ఎదురయ్యే ఇబ్బందులూ ప్రమాదాలతో రాజీపడి
ఎప్పటికప్పుడు మరచిపోయి సామాన్యుడు
మళ్లీ బస్సెక్కక తప్పదు మరి.
*

-కాళిదాసు బి. 8686706463