Others

శుభ్రపరచండిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని నగలున్నా ముత్యాలు ధరించడానికి ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. ముత్యం శరీరానికి తగులుతూ ఉంటే మంచిదంటారు. ఆరోగ్యపరంగా కూడా ముత్యం ధరించడం మంచిదనే వైద్యులూ ఉన్నారు. జ్యోతిష్యపరంగా కూడా ముత్యాలను ధరించమని చెబుతుంటారు.
అయితే వానాకాలం వస్తే ఈ ముత్యాలను భద్రపరచం చాలాఅవసరం.
ఎక్కువ తేమ ఉంటే వాటి మెరుపు కోల్పోతుంటాయి. ధరించేముందు కూడా పౌడర్లు, స్ప్రేలు, అనేకవిధాలైన శరీరానికి పూసుకొనే అంగరాగాలన్నీ పూసేసుకున్నతరువాత పూర్తిగా మేకప్ అయిపోయింది అనుకొన్నతర్వాత ఈ ముత్యాల నగలను ధరించాలి. మళ్లీ వీటిని భద్రపరిచేటపుడు మంచి వెల్వెట్ క్లాత్‌తో కాని మెత్తని గుడ్డతో కాని తుడవాలికాని, నీళ్లతోనో అమోనియా వంటి రసాయనాలున్న క్లీనర్స్‌తోనో ముత్యాలను క్లీన్ చేద్దామనుకోకూడదు.
కేవలం మెత్తని గుడ్డతో తుడిస్తేనే చాలు ముత్యాలు మంచి మెరుపులీనుతుంటాయి. *