Others

ఇలా చేసి చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడుపు నొప్పి తెలీని వారు ఎవరూ ఉండరు. పిల్లలైనా, పెద్దలైనా సరే కడుపునొప్పితో గిలగిలాడిన సందర్భాలు ఉంటూనే ఉంటాయి. అసలీ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అని ఆరా తీస్తే
అపెండిసైటిస్, కిడ్నీలోని రాళ్లు, డయాలసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్లు, అండాశయాల వాపు ఇలాంటి వాటివల్ల కడుపునొప్పి వస్తుంటుంది. కాని చిన్న పిల్లల్లో తరుచు వచ్చే కడుపునొప్పి మాత్రం మలబద్ధకం వల్ల వస్తుంటుంది పెద్దలు చెబుతున్నారు. చిరుతిండ్లు ఎక్కువగా తినడం, అన్నం సరిగా తినక పోవడం, పండ్లు , పచ్చి కూరలు అసలు తినకపోవడం ఇలాంటి వాటివల్ల పిల్లలు కడుపునొప్పితో అవస్థలు పడుతుంటారు.
ఇలాంటి వాళ్లు ముఖ్యంగా ప్రతిరోజు వామును నలిచి ఉప్పుకలుపుకొని ఒక చంచా తిని ఒక గ్లాసు వేణ్ణీళ్లు తాగితే చాలు జీర్ణశక్తి సరిగా ఉండి మలబద్దక సమస్య రాదు. కడుపునొప్పి రాకుండా ఉంటుంది. పొద్దునే్న పరగడుపున శొంఠిని కూడా ఉప్పులోనైనా చక్కెరలోనైనా కలుపుకుని ఒక చంచా తిని కాసిని వేడినీళ్లు తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
ఇవి కాక ఇంకా పైన చెప్పిన సమస్యల్లాంటిలో లేక వేరొక సమస్యలతో కడుపునొప్పి వస్తుంటే ఇలా చేసి చూడండి.
* పిప్పళ్ల చూర్ణం అరటీస్పూన్, ఆవునెయ్యి ఒక టీ స్పూన్ కలిపి గోరువెచ్చని ఆవుపాలతో తాగితే
కడుపునొప్పి తగ్గుతుంది.
* ఒక చంచాడు మారేడు పిందెల చూర్ణాన్ని సమంగా బెల్లం చేర్చి తింటే కడుపునొప్పి తగ్గుతుంది.
మల్లబద్దకం కూడా తగ్గుతుంది.
* కొర్రబియ్యం తో చేసిన పాయసంలో చక్కెర కలిపితింటే కడుపునొప్పి తగ్గుతుంది.
* అరటీస్పూన్ పాత గోధుమల చూర్ణంలో అరటీస్పూన్ తేనె కలిపి తింటే కడుపు నొప్పి తగ్గుతుంది.
* శొంఠిని దోరగా వేయించి మెత్తగా చూర్ణం చేసి, దానిలోకి కొద్దిగా సైంధవ లవణం కలపాలి. ఈ చూర్ణాన్ని వేడి వేడి
అన్నంలో నెయ్యి తో కలిపి తింటే కడుపునొప్పి ఉబ్బరం తగ్గుతాయి.
* మిరియాలు వేయించి సన్నగా పొడి చేసుకొని వేడి అన్నం లో వేసుకొని నెయ్యి కలుపుకుని తింటే
కడుపునొప్పి తగ్గుతుంది.
* ఉలవలు బాగా ఉడికించి పైన తేరిన నీటిలో మిరియాల చూర్ణం సైంధవలవణం
కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
* బార్లీ బియ్యంతో చేసిన పాయసంలో తేనె కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
* వేడివేడి అన్నంపైన వెల్లుల్లి రెబ్బలు పెట్టి ఉంచివాటిని నేయితో కలిపి తింటే కడుపు ఉబ్బరం ,
కడుపునొప్పి తగ్గుతుంది.

- జంగం శ్రీనివాసులు